ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…