సొంత కరెన్సీల్లో ఇండియా-ఇరాక్ వ్యాపారం

ఇండియా, ఇరాక్ దేశాలు తమ సొంత కరెన్సీల్లో ద్వైపాక్షిక వ్యాపారం సాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెబుతున్నారు. ఇరాక్ ప్రధాని నౌరి కమిల్ ఆల్-మాలికి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న నేపధ్యంలో ఆనంద్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ కరెన్సీకి బదులుగా సొంత కరెన్సీలలో వ్యాపారం చేసినట్లయితే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునే భారం ఇరు దేశాలకు తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతూ, కరెంటు…