కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఇండియా అప్పు రూ. 4.5 ట్రిలియన్లు -రాయిటర్స్ సర్వే
రానున్న ఆర్ధిక సంవత్సరంలో (2011-12) 4.5 ట్రిలియన్ల రూపాయల (4.5 లక్షల కోట్ల రూపాయలు) అప్పును ఇండియా సేకరించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వేలో తేలింది. ఇది 99.3 బిలియన్ల డాలర్లకు (99,300 కోట్ల రూపాయలు) సమానం. ప్రభుత్వాలు “సావరిన్ డెట్ బాండ్లు” జారీ చేయటం ద్వారా అప్పును సేకరిస్తాయి. వివిధ ఫైనాన్షియల్ (ద్రవ్య) కంపెనీలు, ఆర్ధిక రేటింగ్ కంపెనీలు, విశ్లేషణా సంస్ధలు, అర్ధిక మేధావులు మొదలైన వారిని వార్తా సంస్ధలు సర్వే చేసి…