విమానం తోలటానికి నువ్వు పనికి రావు, వెళ్లి చెప్పులు కుట్టుకో ఫో!

చాతుర్వర్ణాల హైందవ నాగు భారత దేశ సామాజిక వ్యవస్థను తన విష కౌగిలిలో బంధించి ఉంచడం కొనసాగుతున్నదన్న సంగతిని దేశంలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న ఘటనలు చాచి కొట్టినట్లు చెబుతూనే ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన 35 యేళ్ల వ్యక్తి పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ డ్యూటీలో చేరేందుకు గురుగ్రాంలో ఉన్న కార్పొరేట్ ఆఫీసుకి వెళ్ళడం తోనే మరే ఇతర కొత్త పైలట్ కు ఎదురు కాని కష్టాలు మొదలయ్యాయి.…