ఇంటర్నెట్ వినియోగదారులపై నిఘా పెట్టమని ఇండియా చాలాసార్లు కోరింది -గూగుల్
తమది గొప్ప ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకునే దేశాలే ఇంటర్నెట్ వినియోగదారులపై నిఘా పెట్టమని కోరిన వాటిలో ముందుంటున్నాయి. గూగుల్ తెలిపిన సమాచారం ప్రకారం అమెరికా, బ్రెజిల్ ల తర్వాత ఎక్కువసార్లు వినియోగదారులపై నిఘా పెట్టమనిగానీ, వినియోగదారుల సమాచారాన్ని ఇవ్వమని గానీ భారత ప్రభుత్వమే ఎక్కువ సార్లు కోరింది. గత సంవత్సరం (2010) జులై నుండి డిసెంబరు లోపు భారత ప్రబుత్వం 1699 సార్లు యూజర్ ఎకౌంట్ల సమాచారాన్ని కోరిందని గూగుల్ తెలిపింది. గూగుల్ని వినియోగదారుల సమాచారాన్ని…