ఆ చల్లని సముద్ర గర్భం -శ్రామికుడి నోటి పాట

ఈ పాటను నేను చాలాసార్లు విన్నాను. పాడటంలో అనుభవం ఉన్నవారి నోట విని తన్మయం చెందాను. వారిలో చాలా మంది చూసి పాడేవాళ్లు. చూడకుండా పాడితే తప్పులు పాడేవాళ్లు. కొంతమంది పాడుతూ ఉండగానే శృతి తప్పేవాళ్లు. మళ్ళీ అందుకోడానికి యాతన పడేవాళ్లు. కానీ మొదటి సారి ఈ పాటని ఒక శ్రమ జీవి నోటి నుండి వింటున్నాను. పాటలోని పదజాలం పుస్తకాల్లో మాత్రమే దొరికేది. జానపదం లాగా పల్లె పదాలు కావవి. సంస్కృత పదాలు కలిసి ఉన్న…