అమెరికా ఆహార సబ్సిడీ: పెద్దలే కాదు యువతకీ కావాలి

భారత దేశంలో ఆహార సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారని అమెరికా ఒకటే ఇబ్బంది పడుతుంది. ఆహార సబ్సిడీ పధకాన్ని ‘ఫ్రీ మీల్స్’ అని అమెరికా, ఐరోపా తదితర పశ్చిమ రాజ్యాల మేధావులు ఎకసక్కెం చేస్తారు. తద్వారా తమ దేశంలో అందరూ పని చేస్తేనే భోజనం చేస్తారన్న సందేశం ఇస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే అమెరికా, ఐరోపా దేశాల్లో ఇండియా కంటే అనేక రెట్లు ఎక్కువ సబ్సిడీ తమ కంపెనీలకు, జనానికి ఇస్తారు. అమెరికాలో ప్రాధమిక విద్య, ఉన్నత పాఠశాల…