ఉల్లి భద్రతా బిల్లు కావాలి! -కార్టూన్

– “దానికంటే ముందు ఉల్లి భద్రతా బిల్లు తెస్తే ఎలా ఉంటుందంటారు?” – ఆహార భద్రతా బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పత్రికలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు గాను ఈ బిల్లును ‘ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్’గా కాంగ్రెస్ పరిగణిస్తోందనీ అందుకే ఈ బిల్లుపై అత్యంత పట్టుదలతో ఆ పార్టీ ఉన్నదనీ పత్రికల కధనం. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పట్టుబట్టి ఈ బిల్లుకు రూపకల్పన చేశారని కాబట్టి…

పార్లమెంటు పొయ్యిపై ఆహార బిల్లు వంటకం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండీ ఈ బిల్లు గురించి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నిరసనల హోరు మధ్య నిన్ననే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ నిరసనలు ఆహార భద్రతా బిల్లుపై కాకుండా వేరే అంశాలపైన కావడం గమనార్హం. కొంతమంది తెలంగాణ వద్దని నినాదాలు చేస్తుంటే, మరి కొంతమంది కాశ్మీరులో జవాన్ల హత్యలపై ఆందోళన చేస్తుండగా ఈ బిల్లుని హడావుడిగా ప్రవేశపెట్టారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి తొందర…

మనకీ ఉన్నారు కామిక్ హీరోలు! -కార్టూన్

ప్రపంచం అంతా పాపులారిటీ సంపాదించిన కామిక్ హీరోలంతా దాదాపు పశ్చిమ దేశాల వాళ్ళే. సూపర్ మేన్, బ్యాట్ మేన్, స్పైడర్ మేన్, ఫాంటమ్ ఇత్యాదూలంతా పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ప్రాణం పోసుకున్నవారు. వారితో సమానంగా పాపులారిటీ సంపాదించిన జంతు రూప’ కామిక్ క్యారెక్టర్లు కూడా అక్కడివే. అదేం కాదు, మనకి కూడా కామిక్ హీరోలు, క్యారెక్టర్లు ఉన్నారని చెబుతున్నారు ది హిందూ కార్టూనిస్టు. సృజనాత్మకత ఉట్టిపడుతున్న మన కామిక్ హీరోల గొప్పతనాన్ని కనిపెట్టడానికి కేశవ్ లాంటి…

వడ్డించేవారు కొట్టుకుంటే… -కార్టూన్

‘అదిగో, ఇదిగో’ అంటూ యు.పి.ఏ ప్రభుత్వం ఊరిస్తూ వచ్చిన ‘ఆహార భద్రతా బిల్లు’, ‘భూముల స్వాధీనం  బిల్లు’ ఆమోదానికి నోచుకోకుండానే పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్, రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ లు రాజీనామా చేయడమో, లేదా పదవుల నుండి తప్పించడమో జరిగేదాకా పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని బి.జె.పి ప్రకటించడంతో ఈ పరిస్ధితి వచ్చింది. బుధవారం సభ ముగిశాక పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడుతుందని…