యురేనియంను ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -2
రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు వచ్చి అణు రియాక్టర్ల వ్యాపారం విషయమై ఇండియా తో చర్చించి వెళ్ళారు గానీ అమెరికా నుండి అణు రియాక్టర్ల అమ్మకానికి సంబంధించి ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దానికి కారణం కూడా ఇండియాపైనే మోపుతోంది. అణు రియాక్టర్లు, అణు పదార్ధాలు సరఫరా చేసే అమెరికా కంపెనీలు (జనరల్ ఎలక్ట్రిక్, తోషిబా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్) నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువలన గానీ, లోపాలతో కూడిన రియాక్టర్లు…