నో ఇండియన్స్ ప్లీజ్! -ఆస్ట్రేలియాలో ఉద్యోగ ప్రకటన
భారతీయులు గానీ, ఆసియన్లు గానీ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించిన ఒక ‘ఉద్యోగ ప్రకటన’ ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సూపర్ మార్కెట్ లో క్లీనర్ ఉద్యోగాల కోసం ‘గమ్ ట్రీ’ (Gumtree) వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఇండియన్లు, ఆసియన్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయనవసరం లేదని పేర్కొంది. ఈ ప్రకటన పట్ల సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఆగ్రహం వ్యక్తం అయింది. ప్రకటన జారీ చేసిన ‘కోల్స్’ సూపర్ మార్కెట్ స్టోర్ ను ప్రజలు బహిష్కరించాలని…
