దిగొచ్చిన యూకే, ఇండియాపై కోవిడ్ ఆంక్షలు తొలగింపు
ఇండియా ప్రతీకార చర్యలతో యూకే దిగి వచ్చింది. వ్యాక్సిన్ డోసులు పూర్తిగా వేసుకున్న భారత ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాతో పాటు మరో 47 ఇతర దేశాలపై కూడా ఆంక్షలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10, సోమవారం నుండి గతంలో విధించిన నిబంధనలను భారత ప్రయాణీకులు పాటించనవసరం లేదని యూకే ప్రభుత్వ ఒక ప్రకటనలో తెలిపింది. (లైవ్ మింట్, అక్టోబర్ 8) దీని ప్రకారం స్ధానికంగా ఉత్పత్తి చేసిన కోవి షీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు…

