(90 మంది రోగులను చంపిన) కోల్ కతా ఆసుపత్రి డైరెక్టర్లను వెంటనె విడుదల చేయాలి -ఫిక్కి

డిసెంబరు 9 తేదీన కోల్ కతా లోని ‘ఎ.ఎం.ఆర్.ఐ ధాకూరియా’ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొంభై మందికి పైగా రోగులు, ఉద్యోగులు చనిపోయిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి మమత ప్రమాదానికి వెంటనే స్పందించి ఆసుపత్రి డైరెక్టర్లు పది మందిలో ఏడుగురిని వెంటనే అరెస్టు చేయించింది. వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో కోల్ కతా జైలులోనే ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని భారత పెట్టుబడిదారుల సంఘం “ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్…