అమెరికా ఆశల మేరకు చైనాతో మిలట్రీ పోటీకి ఇండియా అనాసక్తి?

అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పసిఫిక్’ విధానంలో చైనాతో మిలట్రీ పోటీకి ఇండియాను నిలపడం పట్ల భారత రక్షణ మంత్రి అనాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆసియా పై అమెరికా కేంద్రీకరణ పెరగడం వల్ల పొరుగున ఉన్న సముద్రాల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆయుధ పోటీ పెరుగుతుందని ఇండియా భావిస్తున్నట్లు భారత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. అమెరికా తన విధానాన్ని పునరాలోచించాలనీ, పునర్మూల్యాంకనం చేసుకోవాలని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకు భారత్ సూచించిందని అధికారులు తెలిపారు. ‘ఆసియా-పసిఫిక్ కేంద్రంగా…

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆయుధ పోటీ -చైనా శ్వేతపత్రం

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలొ అమెరికా ఆయుధ పోటీ పెంచుతున్నదని చైనా అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వం జారీ చేసిన ‘జాతీయ రక్షణ శ్వేత పత్రం’ లో చైనా, దాని చుట్టూ ఉన్న రక్షణ పరిస్ధితులను విశ్లేషించింది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలట్రీ ఉనికి పెరుగుతున్నదని శ్వేత పత్రం తెలిపింది. ఈ ప్రాంతంలోని సైనిక చర్యలు అంతిమంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడి ఉన్నాయని పత్రం తెలిపింది. భద్రతాంశాలపై చైనా దృక్పధాన్నీ, తన రక్షణ బలగాల గురించిన సమగ్ర దృక్పధాన్ని శ్వేత పత్రం…