ద.చై.సముద్రం: అమెరికా ప్రతిపాదనను లెక్క చేయని ASEAN

దక్షిణ చైనా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు రేపడానికి అమెరికా చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు కనిపిస్తోంది. సముద్రంలో చైనా ప్రారంభించిన చమురు డ్రిల్లింగ్ కార్యకలాపాలను స్తంభింపజేయాలని అమెరికా ప్రతిపాదించగా ASEAN దేశాలు సదరు ప్రతిపాదనను తాము చర్చించనేలేదు పొమ్మన్నాయి. అసలు దక్షిణ చైనా సముద్రంలో సమస్యలు ఉన్నాయని ఎవరన్నారని చైనా ప్రశ్నించింది. ASEAN గ్రూపు దేశాలే అమెరికా ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో అమెరికా పరువు గంగలో కలిసినట్లయింది. ASEAN రీజినల్ ఫోరం సమావేశాలు మియాన్మార్ రాజధానిలో ఈ వారాంతంలో…