తాజా వార్త: దేశం విడిచి వెళ్ళిన యెమెన్ అధ్యక్షుడు సలే

శుక్రవారం నాటి రాకెట్ దాడిలో గాయపడిన యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే మెరుగైన వైద్యం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళినట్లుగా బిబిసి ప్రకటించింది. అధ్యక్షుడు సలేతో పాటు అతని కొలువులోని ప్రధాని తదితర ముఖ్య అధికారులంతా దేశం విడిచి వెళ్ళినట్లు తెలిపింది. అయితే ఆయన వైద్యం కోసమే వెళ్ళాడా లేక ప్రజల డిమాండ్ ను నెరవేర్చాడా అన్నది వెంటనే తెలియరాలేదు. శుక్రవారం గాయపడ్డాక అధ్యక్షుడు సలే మళ్ళీ ప్రజలకు టీవిలో కనిపించలేదు. ప్రభుత్వ టెలివిజన్ ఆడియో…

రాకెట్ దాడిలో యెమెన్ అధ్యక్షుడికి గాయాలు, ప్రజాందోళనలు తీవ్రతరం

తిరుగుబాటు తెగలు శుక్రవారం అధ్యక్ష భవనంపై చేసిన రాకెట్ దాడిలో అధ్యక్షుడు, ఆలి అబ్దుల్లా సలే గాయపడ్డాడు. ఆయనతో పాటు ప్రభుత్వంలోని ఇతర ముఖ్య అధికారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన తర్వాత అధ్యక్షుడికి ఏమీ కాలేదని, కొద్ది గంటల్లో ప్రజలముందుకు వస్తాడని చెప్పినప్పటికీ అది జరగలేదు. దాడి జరిగిన ఆరు గంటల అనంతరం ప్రభుత్వ టివీలో రికార్డు చేయబడిన ఉపన్యాసం వినిపించారు. సలే కష్టంగా మాట్లాడాడని, మద్య మధ్యలో ఊపిరి భారంగా తీసుకున్నాడని విలేఖరులు తెలుపుతున్నారు.…