ఆర్.టి.ఐ పరిధిలో మోడి, వాజ్ పేయ్ ఉత్తర ప్రత్యుత్తరాలు?
2002 నాటి గుజరాత్ మారణకాండ కాలంలో అప్పటి ప్రధాని వాజ్ పేయ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు త్వరలో బహిరంగం కావచ్చని తెలుస్తోంది. అయితే దీనికి గుజరాత్ ప్రభుత్వం మరియు, ముఖ్యమంత్రి మోడిల అనుమతిని ప్రధాన మంత్రి కార్యాలయం కోరుతున్నట్లు తెలుస్తోంది. గోధ్రా రైలు దహనం అనంతర కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రి ల మధ్య జరిగిన సంభాషణను వెల్లడి చేయాలంటూ ఆర్.టి.ఐ కార్యకర్త ఒకరు దరఖాస్తు చేయగా దానిని ప్రధాన మంత్రి…