ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు…