నన్ను ఇరికించడానికి రక్షణ శాఖే నా లేఖ లీక్ చేసింది -ఆర్మీ ఛీఫ్
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖే తాను ప్రధాన మంత్రికి రాసిన లేఖను లీక్ చేసిందని ఆర్మీ ఛీఫ్ జనరల్ వి.కె.సింగ్ శనివారం ఆరోపించాడు. కొంత సమాచారాన్ని ఎంచుకుని మరీ లీక్ చేసి తనను ఇరికించాలని ప్రయత్నించిందని ఆరోపించాడు. మరో ఐదు రోజుల్లో రిటైర్ కానున్న వి.కె.సింగ్ తాజా ఆరోపణల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఢీ కొన్నట్లయింది. వివిధ టి.వి చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన న్యాయ వ్యవస్ధను కూడా తప్పు పట్టాడు. గాలివాటుతో పాటు తననూ…






