జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులు నీరు కార్చుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్
అనుకున్నదే అయింది. ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం తర్వాత మాటల్లో, హామీల్లో అగ్ని కణాలు రువ్విన ప్రభుత్వ పెద్దలు చేతల్లో తుస్సుమనిపించారు. మహిళల భద్రతకే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని డంబాలు పలికిన ప్రధాని మన్మోహన్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలు జస్టిస్ వర్మ కమిటీలోని ప్రధాన సిఫారసులను గాలికి వదిలేశారు. ప్రధాన సిఫారసులను నిరాకరించిన అప్రతిష్టను కప్పిపుచ్చుకోవడానికో యేమో తెలియదు గానీ వర్మ కమిటీ నిరాకరించిన మరణ శిక్షను అరుదైన కేసుల్లో విధించడానికి…
