‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె!’, ఆఫ్రికాలో ఇండియా ఔదార్యం

“ఓ వైపు ఇండియాలో ఆకలితో ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోతుండగా, మరో వైపు భారత్ శక్తివంతమైన దేశంగా ఎలా చెలామణి అవుతోంది? రెండు ఇండియాలు ఎలా సాధ్యం?” అంటూ భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తలంటు పోసి రెండు నెలలు కూడా కాలేదు. “గోదాములు లేక ఆరుబైట పరదాల క్రింద ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసి పాడుపెట్టే బదులు ఆకలితో ఉన్నవారికి ఉచితంగా పంచండి” అని సుప్రీం కోర్టు సలహా ఇస్తే “ఉచితంగా ఇవ్వడం సాధ్యం…

విద్య, ఆరోగ్యాలకు బదులు న్యాయ, పోలీసు రంగాలకు సాయం చెయ్యండి -ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంకు తన నగ్న స్వరూపాన్ని సిగ్గు లేకుండా బైట పెట్టుకుంది. పేద దేశాలకు సహాయం పేరుతో అప్పులిచ్చే అభివృద్ధి చెందిన దేశాలు తాము కేంద్రీకరించే రంగాలను మార్చాలని కోరింది. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చాయనీ, అలా కాకుండా న్యాయ వ్యవస్ధ, పోలీసు వ్యవస్ధలు అభివృద్ధి చెందటానికి సహాయం చేయడం ప్రారంభించాలని కోరింది. సోమవారం విడుదల చేసిన ఒక రిపోర్టులో “ఆయా దేశాల్లో స్ధిరమైన ప్రభుత్వాలను నిర్మించడంపై…