ప్రశ్న: రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటి?

అంకమ్మ ‘ ‘: సర్, రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటో చెప్పండి. జవాబు: మీ పేరు చివర తోకను రాయనందుకు అన్యధా భావించ వద్దు. నిన్న రష్యా ఆర్ధిక వ్యవస్థ గురించి రాసిన టపాలో రియల్, నామినల్ జిడిపి ల గురించి ప్రస్తావించాను. బహుశా అది చదివాక మీకు ఈ ప్రశ్న ఉదయించి ఉంటుంది. ఈ జవాబు పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. రియల్ జిడిపి: పేరులోనే ఉన్నట్లు రియల్ జిడిపి ఒక…

హెచ్చరిక సంకేతాలు -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 22 తేదీ ప్రచురించిన ఎడిటోరియల్ Cautionary signals కు ఇది యధాతధ అనువాదం.) ********* 2014-15 కు సంబంధించిన మధ్య సంవత్సర ఆర్ధిక సమీక్ష, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 5.5 శాతం ఉంటుందని వాస్తవికంగా అంచనా వేసింది. ఆర్ధిక వృద్ధి యొక్క ఉరవడి ఇంకా బలహీనంగానే ఉన్నదనీ, ఆర్ధిక వ్యవస్ధ స్ధిరగతిని ఇంకా అందుకోవలసే ఉన్నదనీ… పారిశ్రామిక ఉత్పత్తి, వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంలపై గత వారం విడుదల అయిన ఆర్ధిక గణాంకాలు స్పష్టంగా…

3 సం.ల అత్యధిక స్ధాయిలో చైనా ద్రవ్యోల్బణం, చైనా ఆర్ధిక వృద్ధిపై భయాలు

జూన్ నెలలో చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాల అత్యధిక స్ధాయికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వీలుగా చైనా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను మరింత పెంచే అవకాశాలు పెరగడంతో, వడ్డీ రేట్ల పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ పెట్టుబడుదారులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటును ముందుకు తీసుకెళ్ళడంలో చైనా ఆర్ధిక వ్యవస్ధ…

భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు

గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ…

ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి.…