ఆర్ధిక మాంద్యానికి (రిసెషన్) చేరువలో ఇంగ్లండు

యూరప్‌లో అతి పెద్ద ద్రవ్య మార్కెట్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బ్రిటన్ ఆర్ధిక మాంద్యం కు చేరువలో ఉందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. మూడో క్వార్టర్ (జులై, ఆగస్ఠు, సెప్టెంబరు)లో ఆర్ధిక వృద్ధి అనుకున్నదాని కంటె మెరుగ్గానే ఉన్నప్పటికీ నాలుగో క్వార్టర్ లో అది బాగా క్షీణించవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ మంగళవారం విశ్లేషించింది. యూరోజోన్ రుణ సంక్షోభం ఇంకా శాంతించకపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ పై చూపుతున్నదని ఆ సంస్ధ విశ్లేషించింది. మూడో క్వార్టర్ లో బ్రిటన్…