‘ఔట్’ కాదిక ‘ఇన్’ సోర్సింగ్ -ఒబామా

ఎన్నికలు సమీపించే కొద్దీ అమెరికా అధ్యక్ష పదవి పోటీదారులు తమ అసలు రూపాల్ని బైటపెట్టుకుంటున్నారు. ఆర్ధిక సంక్షోభం, ఓటమి అంచున ఉన్న యుద్ధాలు, జడలు విప్పుతున్న నిరుద్యోగం మున్నగు సమస్యలు విజయావకాశాలను దెబ్బతీస్తున్న పరిస్ధితిని ఒబామా ఎదుర్కొంటున్నాడు. దానితో తాము మూడో ప్రపంచ దేశాల కోసం ప్రదిపాదిస్తూ వచ్చిన ‘గ్లోబలైజెషన్’ విధానాలకు కూడా తమ దేశం వరకూ తిలోదకాలివ్వడానికి సిద్ధపడుతున్నాడు. – –

యూరప్ రేటింగ్ – ఇండియాపై ప్రభావం

అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్ధలకు భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను కట్టిపడేయడం వల్ల అక్కడ ఏం జరిగినా భారత్ పై ప్రభావం తధ్యం. గ్లోబలైజెషన్ ఆర్ధిక విధానాల దుష్ఫలితం ఇది. ‘రష్యా, చైనాల్లో వాన కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారు’ అని గతంలో ఎద్దేవా చేసేవారు. ఇపుడు అమెరికా, యూరప్ లకి జలుబు చేస్తే ఇండియా ఆర్ధిక వ్యవస్ధకి ఏకంగా జ్వరమే తగులుకుంటోంది. తీవ్ర సంక్షోభాలు తలెత్తితే జ్వరమే కాక ఏకంగా…

యూరప్ ‘బెల్ట్ టైటెనింగ్’ -కార్టూన్

యూరో జోన్ దేశాలన్నీ ఖచ్చితమైన ఫిస్కల్ ఆర్ధిక విధానాలను కఠినంగా అమలు చేయాలని, తద్వారా మాత్రమే యూరోజోన్ సంక్షోభం సమసిపోతుందనీ జర్మనీ గత మూడేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ తొ కలిసి కఠిన మైన పొదుపు ఆర్ధిక విధానాలను యూరో దేశాలపై వారు బలవంతంగా అమలు చేయడమే కాక తమ దేశాల ప్రజలపైన కూడా అమలు చేస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు ఇతర వృత్తులలో ఉన్న అనేక తరగతుల ఆదాయ మార్గాలన్నింటిపైన దాడి చేయడమే…

ఫ్రాన్స్ సహా 9 యూరో దేశాల రేటింగ్ కట్

యూరప్ రుణ సంక్షోభం కొనసాగుతోంది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభం నుండి బైటికి వచ్చే సూచనలు సమీప భవిష్యత్తులో లేవని తొమ్మిది యూరో జోన్ దేశాల అప్పు రేటింగ్ ను తగ్గించడం ద్వారా ప్రముఖ రేటింగ్ సంస్ధ స్టాండర్ట్ & పూర్ (ఎస్ & పి) క్రెడిట్ రేటింగ్ సంస్ధ స్పష్టం చేసింది. యూరో జోన్ ఉనికి ప్రధానంగా ఆధారపడి ఉన్న దేశాల్లో ఒకటైన ఫ్రాన్సు రేటింగ్ సైతం ఎస్ & పి తగ్గించి సంక్షోభం…

అనుకోని ఉపద్రవం వస్తే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకునేది ఓ వారమే

ఇప్పటికిప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చిపడితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలిచేది కేవలం ఆ వారం రోజులేనని ఓ అధ్యయన సంస్ధ తేల్చిపారేసింది. ఓ పెద్ద ప్రకృతి విలయం లేదా మిలిటెంట్ల దాడి (9/11 దాడుల్లాంటివి కావచ్చు) వస్తే గనక అటువంటి వాటిని తట్టుకుని సుదీర్ఘ కాలం నిలవ గల శక్తి ఇప్పటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు లేదని ఆ సంస్ధ తేల్చింది. 2010 లో ఐస్ లాండ్ అగ్ని పర్వతం పేలుడుతో ఎగజిమ్మిన బూడిద మేఘాలుగా…

2012 పసి నెత్తిన 2011 భారీ అప్పు -కార్టూన్

యూరప్ ని ఈ కార్టూన్ ఉద్దేశిస్తున్నప్పటికీ, అమెరికా, ఆసియాలకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు అప్పులివ్వడానికి అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు, ప్రజల పైన మాత్రం ‘పొదుపు ఆర్ధిక విధానాలు’ రుద్దుతున్నాయి. కంపెనీల కోసం తాము చేసిన అప్పుని జాతీయ సమస్యగా చేసి ప్రభుత్వాలు ప్రజలపైన రుద్దుతున్నాయి. కంపెనీల కోసం చేసే ఖర్చుని ప్రజల కోసం చేస్తున్న ఖర్చుగా చూపుతూ, నామ మాత్రంగా ప్రజలపై చేస్తున్న ఖర్చులో అవి కోత పెడుతున్నాయి. ఆ విధంగా, ఓ వైపు ప్రజల…

ఇక భారత షేర్ మార్కెట్లతో విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఆడుకోవచ్చు

భారత దేశ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ వ్యక్తిగత మదుపుదారులే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించబోతోంది. జనవరి 15 నుండి విదేశీ మదుపరులను షేర్ మార్కెట్లలోకి అనుమతించనున్నట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను సరళీకరణకు గురిచేసే పధకంలో ఇది మరొక అడుగు. 2011 సంవత్సరంలో షేర్ మార్కెట్లనుండి విదేశీ సంస్ధాగత నిధులు పెద్ద ఎత్తున తరలివెళ్ళిన నేపధ్యంలో ఈక్విటీ మార్కెట్ నిబంధనలను మరింత సరళీకృతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.…

యూరప్ 2012? -కార్టూన్

2012లో యూరప్ ఎలా ఉండబోతోంది? గ్రీసు తో ప్రారంభమై బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీలను సైతం తాకుతుందేమో అని భయపడుతున్న ‘యూరప్ రుణ సంక్షొభం’ ఏయే దేశాలను బలి గోరుతున్నది? రుణ సంక్షోభం విస్తరణ వల్ల యూరప్ జిడిపి వృద్ధి రేటు ఇంకా పడిపోతే అక్కడికి ఎతుమతులు చేసే ఇండియా, చైనాల ఆర్ధిక వ్యవస్ధలు ఎలా ప్రభావితం కానున్నాయి? ఇప్పటికే జిడిపి వృద్ధి క్షీణించిపోయిన భారత ఆర్ధిక వ్యవస్ధపైన యూరప్ రుణ సంక్షోభం మరింత తీవ్రంగా ప్రభావితం చేయనున్నదా?…

2011లో 25 శాతం పతనమైన భారత షేర్లు, సంస్కరణల కోసం భారత పాలకులపై ఒత్తిడి

భారత షేర్ మార్కెట్లకు 2011 సంవత్సరం నిరాశనే మిగిల్చింది. ప్రపంచంలో మరే దేశమూ నష్టపోనంతగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ షేర్ సూచి ఈ సంవత్సరం 24.6 శాతం నష్టపోయింది. ఈ సంవత్సరం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం రోజు కూడా బి.ఎస్.ఇ సెన్సెక్స్ 0.6 శాతం నష్టపోయింది. సంవత్సరం పొడవునా ద్రవ్యోల్బణం రెండంకెలకు దగ్గరగా కొనసాగడం, ద్రవ్యోల్బణం అరికట్టడానికని చెబుతూ ఆర్.బి.ఐ అధిక వడ్డీ రేట్లు కొనసాగించడం, ఆర్ధిక వృద్ధి అనూహ్యంగా నెమ్మదించడం కారణాల వల్ల భారత…

నీళ్ళకీ ధర పెట్టాలి -అహ్లూవాలియా ప్రేలాపన

“ఆంధ్ర జ్యోతి” దిన పత్రికలో ఈ వార్త ప్రచురితమయింది. విదేశీ కంపెనీల ప్రయోజనాలు తప్ప మరొకటి కనపడని మాంటెక్ అహ్లూవాలియా మెదడుకి పెట్టుబడిదారీ పురుగు ఆశించి పూర్తిగా కుళ్ళిపోయిందనడానికి ఈ వార్త ప్రబల ఉదాహరణ. స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాలను పూర్తిగా తలకెక్కించుకోవడమే కాక, కేవలం పశ్చిమ దేశాల ప్రవేటు బహుళజాతి కంపెనీల పనులు చేసి పెట్టడానికే కట్టుబడి ఉన్న ఈ అద్దె మేధావి ప్రజలకు నీరు మరింత అందుబాటులోకి తేవడానికి బదులు వారికి ఇంకా…

మరణ శయ్యపై ఉన్నా, అమెరికా కోలుకుంటోంది -కార్టూన్

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ పరిస్ధితి ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ అది చక్కగా కోలుకుంటోందని అక్కడి పాలకులు చెబుతున్నారు. అలా అని నిరూపించడానికి అష్ట కష్టాలూ పడుతున్నారు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఖరీదైన విద్య, పరిశ్రమల మూసివేత, పడిపోతున్న కొనుగోలు శక్తి మొదలైన సమస్యలు పట్టి పీడిస్తున్నప్పటికీ పై పై మెరుగులు అద్ది అమెరికా కోలుకుంటోందని చెప్పడానికి ఆపసోపాలు పడుతున్నారు. – –  

ఇంగ్లండును అధిగమించిన బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ

ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న ఇంగ్లండును బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ అధిగమించింది. ఇప్పటివరకు ఏడవ స్ధానంలో ఉన్న బ్రెజిల్ బ్రిటన్ ని ఆరవ స్ధానం నుండి కిందికి నెట్టి ఆ స్ధానానికి చేరుకుందని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ బిజెనెస్ రీసర్చ్’ (సి.ఇ.బి.ఆర్) తెలిపింది. ఈ సంస్ధ తాజాగా వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ లీగ్ టేబుల్’ లో ఆసియా దేశాలు పై స్ధానాలకు చేరుతుండగా, యూరప్ దేశాలు కింది స్ధానాలకు చేరుతున్నాయన కూడా తెలిపింది.…

నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు

అమెరికాలో నివసించడానికి ఇల్లు లేని పిల్లలు పెరుగుతున్నారని రాయిటర్స్ తెలిపింది. దాదాపు పదహారు లక్షల మంది పిల్లలు ఇలా ఇల్లు లేక హోం లెస్ షెల్టర్లలో, హోటళ్ళలో, కార్లలో, వీధి పక్కనా, సబ్ వేలలో నివసిస్తున్నారని ఓ సంస్ధ చేసిన సర్వేని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఇల్లులేని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మూడేళ్ల క్రితం అమెరికాను చుట్టుముట్టిన మాంద్యం నుండి ప్రభుత్వ బెయిలౌట్లు మేసిన కంపెనీలు బైటపడ్డాయి…