రికార్డు స్ధాయికి యూరోజోన్ నిరుద్యోగం

17 దేశాల యూరో జోన్ లో నిరుద్యోగం రికార్డు స్ధాయికి చేరుకుంది. జనవరి నాటికి ఈ దేశాల నిరుద్యోగం 10.7 శాతం ఉందని యూరో స్టాట్ సంస్ధ వెల్లడించింది. యూరో జోన్ దేశాల్లోని కంపెనీలు డిసెంబరులో మరో 1,85,000 ఉద్యోగాలు రద్దు చేశాయని గణాంకాలు చెపుతున్నాయి. యూరప్ ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బుని బిలియన్ల కొద్దీ బెయిలౌట్లుగా మేసిన కార్పొరేట్ కంపెనీలు ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడినప్పటికీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు మరిన్ని  ఉద్యోగాలు…

ఎరువుల రేట్ల తగ్గుదల రైతుకి చేరకుండా నోక్కేసిన కేంద్ర ప్రభుత్వం

అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల రైతుకీ చేరకుండా కేంద్ర ప్రభుత్వం నోక్కేసింది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కంపెనీలకు నష్టం వస్తోందంటూ పెంచే ప్రభుత్వం అవి తగ్గినపుడు మాత్రం, ఆ తగ్గుదలను ప్రజలకు అందకుండా తానే నోక్కేస్తుంది. అదే పద్ధతిని ఎరువుల విషయంలో కూడా అనుసరించడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎరువల ధరలను చాలా కాలం క్రితమే ప్రభుత్వం డీ కంట్రోల్ చేసింది. దానివల్ల ఎరువుల ధరలు సాధారణ రైరులకు అందనంత ఎత్తులో…

ఇండియా ‘జిడిపి గ్రోత్’ కధ ఇక కంచికేనా?

ప్రపంచానికి గొప్పగా చూపుతూ వచ్చిన భారత దేశ జి.డి.పి వృద్ధి రేటు ఇక గత కాలపు జ్ఞాపకమేనా? ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని కూడా తట్టుకుని ఎనిమిది శాతం పైగా జీడీపీ పెరుగుదల రేటును నమోదు చేసిన భారత ఆర్ధిక వృద్ధి కధ ఇక కంచికేనా? 2011-12 సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్ల మొత్తం మీద భారత దేశ ఆర్ధిక వ్యవస్ధ నమోదు చేసిన వృద్ధి రేటు చూసీనా, మూడో క్వార్టర్లో నమోదయిన వృద్ధి రేటు చూసినా ఈ…

ipad_iphone_ipod

పాక్ జీడీపీ కి యాపిల్ ‘మార్కెట్ కేపిటలైజేషన్’ మూడు రెట్లు

ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్, మేక్ కంప్యూటర్ల సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ కంపెనీ ‘యాపిల్’ మార్కెట్ కేపిటలైజేషన్ విలువ త్వరలో అర ట్రిలియన్ (500 బిలియన్) డాలర్ల మార్కు దాటనున్నది. మంగళవారం నాటికి ఆ విలువ 499.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది.  ఐ ప్యాడ్ -3 అమ్మకాలు బంపర్ స్ధాయిలో ఉంటాయన్న ఊహాగానాలతో యాపిల్ కంపెనీ స్టాక్ విలువ పైపైకి దూసుకు పోతుండడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రికార్డు స్ధాయిని చేరుతోంది.…

Austerity ward

‘పొదుపు విధానాల’ క్షతగాత్ర ‘యూరప్’ -కార్టూన్

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వల్ల ఎదురైన నష్టాలను పూడ్చుకునేందుకు అమెరికా, యూరప్ లకు చెందిన బడా కార్పొరేట్ కంపెనీలు అక్కడి ప్రభుత్వాల ద్వారా ప్రజలపైన దారుణమైన పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల ఫలితంగా అనేక యూరప్ దేశాలు క్షత గాత్ర దేశాలుగా మారిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా తమను తాము అభివర్ణించుకునే ఈ దేశాల ప్రభుత్వాలు తాము వత్తాసు పలికే పెట్టుబడిదారీ కంపెనీలకు ఇచ్చిన బెయిలౌట్లు…

ఇండియా, చైనాల్లో కార్ల కొనుగోలు వల్లనే ఆయిల్ రేట్లు పెరగడం -ఒబామా

అమెరికాలో జనం లాగానే ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాల్లోని జనం కూడా కార్లు కొనడం ఎక్కువయిందనీ అందువల్లనే ఆయిల్ ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్నాయనీ ఒబామా కొత్త సంగతి కనిపెట్టాడు. అక్కడికి కార్లు కొని సుఖపడే యోగం అమెరికా ప్రజల సొంతమైనట్లు. వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, అవినీతి, దోపిడి లవల్ల తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులను పరిష్కరించలేక మూడో ప్రపంచ దేశాలపై పడి ఏడ్వడం అమెరికా, యూరప్ లకు మామూలైపోయింది. తమ కంపెనీల దుర్మార్గాన్ని…

Austerity and unemployment

పన్నులు కోతలు వెరసి నిరుద్యోగం -కార్టూన్

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మిగిల్చిన భారాన్ని కోశాగార క్రమశిక్షణతో (fiscal discipline) పూడ్చుకోవాలని ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల్లోని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు బోధిస్తారు. అయితే క్రమ శిక్షణ ను వాల్ స్ట్రీట్ కంపెనీలు, ప్రవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి ‘టూ బిగ్ టు ఫెయిల్’ ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వర్తించవు. ఈ దగుల్బాజీ ఆర్ధికవేత్తల దృష్టిలో క్రమ శిక్షణ పాటించవలసింది ప్రజలే. ప్రజలపై వీరు రుద్దే క్రమ…

Occupy white house

రీ-ఆకుపై వాల్‌స్ట్రీ… సారీ, వైట్‌హౌస్

ఈ సంవత్సరం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా గెలుపొందడం కోసం ఒబామా వేషాలు పునః ప్రారంభమయ్యాయి. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాడు. ధనికులు పై పన్నులు పెంచుతాననిక్, వారి పన్ను రాయితీలు రద్దు చేస్తానని నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ఒబామా తన వాగ్దానాలను అమలు చేయలేదు. తిరిగి అవే వాగ్దానాలను చేయడానికి ఒబామా సిగ్గుపడకపోవడమే ఆశ్చర్యం. – –

గ్రీసు బడ్జెట్ ఇ.యు చేతికివ్వాలి, జర్మనీ దుర్మార్గం

గ్రీసు బడ్జేట్ రూపకల్పనను కూడా యూరోపియన్ యూనియన్ నియంత్రణకి అప్పజెప్పాలన్న దుర్మార్గమైన ప్రతిపాదనను జర్మనీ ముందుకు తెచ్చింది. ఇప్పటికే గ్రీసు దేశ బడ్జెట్ తో పాటు అక్కడి ఆర్ధిక కలాపాలనన్నింటినీ పెద్ద ఎత్తున గుప్పిట్లో పెట్టుకున్న యూరోపియన్ యూనియన్ ఇకనుండి నేరుగా బడ్జెట్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇ.యుకి అధికారం ఇవ్వాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. పేరుకి జర్మనీ ప్రతిపాదన అయినప్పటికీ, యూరోపియన్ యూనియన్ దేశాల్లోని బహులజాతి ప్రవేటు కంపెనీలే జర్మనీ ద్వారా ఈ ప్రతిపాదనను…

‘పెట్టుబడి’ క్రౌర్యానికి ఇద్దరు బలి

‘అనంత’ లాభాలను గుంజుకోవడానికి వెంపర్లాడే పెట్టుబడి క్రౌర్యానికి ఇద్దరు బలయ్యారు. మరణించినవారిలో ఒకరు కార్మిక యూనియన్ నాయకుడు కాగా మరొకరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్. యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పోలీసులు అమానుషంగా జరిపిన లాఠీ ఛార్జిలో కార్మికుల నాయకుడు చనిపోగా, తమ నాయకుడి మరణానికి ఆగ్రహంగా తిరగబడ్డ కార్మికుల చేతిలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు. కార్మికులకు స్ధానిక ప్రజానీకం సంఘీభావంగా ఉద్యమిస్తుండడంతో యానాంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లబడలేదని తెలుస్తోంది. కాకినాడకి ముప్ఫై కి.మీ దూరంలో ఉన్న…

వ్యవసాయ సబ్సిడీలు, దళారీ వ్యవస్ధ

(“‘ఎస్&పి’ తాకి ‘ఇ.యు’ ఓడ మునక” పోస్టు కింద సంజయ్ గారు ఓ వ్యాఖ్య రాశారు. వ్యాఖ్యలో ఫస్ట్ పోస్టు వెబ్ సైట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ లింక్ ఇస్తూ విశ్లేషించమని కోరారు. సంజయ్ గారి కోరిక మేరకు ఈ ఆర్టికల్ రాసి ప్రచురిస్తున్నాను. -విశేఖర్) నూతన ఆర్ధిక విధానాలు రైతులు, కార్మికులకు హాని చేస్తున్నాయన్న నిజాన్ని మరుగుపరచడానికి ఇటువంటి అర్ధ సత్యాలతో కూడిన వాదనలు చాలా వ్యాప్తిలోకి తెచ్చారు. ‘ఫస్ట్ పోస్టు’ ఆర్టికల్ లోనే…

అప్పుల కుప్ప యూరప్

కొత్త సంవత్సరం యూరో దేశాలకు అనుకూలంగా ఉన్నట్లు లేదు. పదిహేడు దేశాల యూరో జోన్ కూటమి కొత్త సంవత్సరంలో చెల్లించవలసిన అప్పులు దాదాపు 700 బిలియన్ యూరోల వరకూ ఉంది. ఈ అప్పు చెల్లించకపోతే అలా చెల్లించలేని దేశం డిఫాల్ట్ (దివాలా) తీసినట్లుగా ముద్రపడుతుంది. దివాలా తీసిన దేశానికి కొత్త అప్పులు ముట్టవు గనక రోజువారి ఖర్చులు గడవడం కూడా గగనం గా మారుతుంది. దివాలా తీసిన దేశాలకు సాయం చెయ్యడానికి యూరప్ దేశాలు ఒక ట్రిలియన్ యూరోల…

రైలు పట్టాల ఏకాభిప్రాయం -కార్టూన్

పదిహేడు యూరప్ దేశాక కూటమి యూరో జోన్ కి జర్మనీ, ఫ్రాన్సు లు నాయకులు. వీరికి తమ తమ ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రయోజనాలకి యూరో ఉమ్మడి కరెన్సీ అవసరం. ‘ఉమ్మడి కరెన్సీ ని కాపాడుకోవాలా?’ తమ దేశాల కంపెనీలు, బ్యాంకుల ప్రయోజనాలు కాపాడుకోవాలా? అన్నది వీరి మీమాంస. ఈ మీమాంస వీరిని చెరో పట్టాపై నిలిపింది. తమ తమ పట్టాలపై కొనసాగుతూ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఎన్ని సమావేశాలు జరిపినా ఏం ప్రయోజనం? – – జర్మనీ…