లేదు లేదంటూనే ప్రధాని, చిదంబరంలను మళ్ళీ కోర్టులో ప్రస్తావించిన ఎ.రాజా

సోమవారం కోర్టులో తాను ప్రధాని మన్మోహన్, మాజీ అర్ధిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరం లకు వ్యతిరేకంగా ఆరోపణలను చేశాననడం మీడియా సృష్టి అవి చెబుతూ, మీడియాను చేస్తే సరిగా రిపోర్టు చేయమనండి లేదా బైటికి పంపించండి అని మంగళవారం జడ్జిని కోరిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మళ్ళీ మన్మోహన్, చిదంబరం ల పేర్లను తన వాదనలో ప్రస్తావించాడు. సోమవారం కంటే ఈ సారి కాసింత నేరుగానే వారిపై ఆరోపణలు సంధించే ప్రయత్నం చేశాడు.…

11వ సారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్.బి.ఐ, షేర్ మార్కెట్లు బేజారు

ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్…

కోర్టులో మన్మోహన్, చిదంబరం పేర్లను ప్రస్తావించిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా

ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్‌నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు.…

రేటింగ్‌లతో ఆర్ధిక పతనాలకు కారణమవుతున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు -కార్టూన్

స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), ఫిఛ్, మూడీస్… ఈ మూడు సంస్ధలు ప్రపంచంలో అత్యధిక రేటింగ్ ఉన్న “రేటింగ్ ఏజన్సీలు.” ఇవి వివిధ దేశాల, ముఖ్యంగా మార్కెట్ ఎకానమీని చేపట్టిని దేశాల సావరిన్ అప్పులకు రేటింగ్ ఇస్తాయి. సావరిన్ అప్పులనే ట్రెజరీ బాండ్స్ అంటారు. వివిధ దేశాల ప్రభుత్వాలు మార్కెట్ నుండి, అంటే ప్రవేటు పెట్టుబడిదారులనుండి అప్పులు సేకరించడం కోసం ట్రెజరీ బాండ్లు జారీ చేస్తాయని తెలుసుకున్నాం. వివిధ దేశాల ట్రెజరీ బాండ్లలో తమ…

ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి దాపురించింది. అణు బాంబులతో పాటు అణు విద్యుత్‌కి వినియోగించే యురేనియం నిల్వలు ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లెలో పుష్కలంగా ఉన్నాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తెలిపాడు. ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత అధిక స్ధాయిలో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం లేదని ఆయన తెలిపాడు. ఇటీవల జరిపిన అధ్యయనాల ద్వారా తుమ్మలపల్లెలో35 కి.మీ పరిధిలో1.5 లక్షల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నాయని…

గుర్రాల వ్యాపారి హసన్ ఆలీ ఖాన్ విదేశీ బ్యాంకులకు తరలించింది రు.3600 కోట్లు -ఇ.డి

పూనే గుర్రాల వ్యాపారి ‘హసన్ ఆలీ ఖాన్’ 800 మిలియన్ డాలర్ల (రు.3600 కోట్లు) నల్లధనాన్ని విదేశీ బ్యాంకులకు తరలించాడని ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, బోంబే హైకోర్టు కు సోమవారం తెలిపింది. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని బ్యాంకులకు ఈ డబ్బు తరలించినట్లుగా ఇ.డి కోర్టుకు తెలిపింది. ఈ విదేశీ బ్యాంకుల అధికారులతో హసన్ ఆలీ ఖాన్‌కు లోతైన సంబంధాలున్నాయని ఇ.డి తెలిపింది. సెషన్స్ కోర్టు హసన్ ఆలీ ఖాన్ కు…

కొత్తశాఖలో జైరాం రమేష్ మార్కు విధానాలు ప్రారంభం, గ్రామీణాభివృద్ధికి 90,000 కోట్లు

పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఇతర మంత్రుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న జైరాం రమేష్ తనకు అప్పజెప్పిన గ్రామిణాభివృద్ధి శాఖలో కూడ తన మార్కు విధానాలను ప్రారంభించాడు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పధకాలన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తిగా నిర్వహణ రాష్ట్రాలకే అప్పజెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్ణయించగా, దానికి జైరాం రమేష్ పక్కకు నెట్టి కేంద్ర…

నల్ల డబ్బుపై సిట్ నియామకం సుప్రీం కోర్టు అతి -రివ్యూ పిటిషన్‌లో కేంద్రం

సుప్రీం కోర్టు అతిగా వ్వవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశాల్లో దాచిన నల్లడబ్బును వెనక్కి తెప్పించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం” ను నియమించడంలో సుప్రీం కోర్టు తన పరిధికి మించి వ్యవహరించిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ నియామకంపై జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని తన పిటిషన్‌లో కోరింది. ఇది “న్యాయవ్యవస్ధ అతి” అని పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. రిటైర్డ్ సుప్రీం…

రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఇది చాలదంటున్న ప్రధాని

2010-11 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాలను ఇండియా ఉత్పత్తి చేసినట్లు భారత ప్రధాని శనివారం ప్రకటించాడు. ఎన్నడూ లేనంతగా 241 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించినప్పటికీ, అధిక ధరలతో పాటు పెరుగుతున్న డిమాండ్ తట్టుకోవడానికీ ఇంకా అధిక ఉత్పత్తి సాధించవలసి ఉన్నదని ప్రధాని మన్మోహన్ తెలిపాడు. 2007 నుండి 2012 వరకూ ఉన్న11 వ పంచ వర్ష ప్రణాళికలో 4 శాతం వ్యవసాయ వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవంలో…

కంప్యూటర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్త రూపాయి సింబల్

ఇకనుండి రూపాయి సింబల్‌ను డాలర్, పౌండ్, యూరో లాగా కంప్యూటర్ లో టైప్ చెయ్యవచ్చు. దీనికోసం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ (టి.డి.ఐ.ఎల్) వెబ్ సైట్ (http://tdil-dc.in/) నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్ సైట్ ఎందువల్లనో ప్రస్తుతం లోడ్ కావడం లేదు.  ఆ తర్వాత కీ బోర్డులో ‘Alt Gr’ ను 4 తో కలిపి టైప్ చేసినట్లయితే రూపాయి సింబల్ కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతుంది.…

అమెరికా అప్పు -కార్టూన్

అమెరికా 14.3 ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువ అప్పు చేయకూడదని పరిమితి ఉంది. మూడు దురాక్రమణ యుద్ధాల పుణ్యమాని అప్పు గరిష్ట పరిమితిని చేరుకుంది. అప్పులు చేసి ఆర్ధిక సంక్షోభంలో కుదేలైన బడా బడా వాల్ స్ట్రీట్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం బెయిలౌట్లు ఇచ్చింది. యుద్ధాలు మానేస్తే ఈ పరిస్ధితి వచ్చి ఉండకపోను. ఇప్పుడు అమెరికా తెచ్చిన కొన్ని అప్పులపై వడ్డీల చెల్లింపులకు, మరి కొన్ని అప్పుల పూర్తి చెల్లింపులకు గడువు ఆగష్టు 2 తేదీ గడువు. ఆ…

అమెరికా అప్పు రేటింగ్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటింగ్ సంస్ధలు

ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న అమెరికా సావరిన్ అప్పు రేటింగ్‌ను తగ్గించడానికి ప్రపంచంలోని టాప్ రేటింగ్ సంస్ధలు మూడూ సిద్ధంగా ఉన్నాయి. స్టాండర్డ్ & పూర్స్ (ఎస్ & పి), ఫిచ్, మూడీస్ లు ప్రపంచ రేటింగ్ సంస్ధల్లో మొదటి మూడు సంస్ధలుగా పేరు పొందిన రేటింగ్ సంస్ధలు. ఇవి ఆయా దేశాల సావరిన్ అప్పు బాండ్లకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా వివిధ ద్రవ్య సంస్ధలు, బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు తదితర…

జూన్ నెలలో కూడా ద్రవ్యోల్బణం మరింత పై పైకి…

భారత దేశంలో నిత్యావసర సరుకులు, వినియోగ సరులులతో పాటు సమస్త వస్తువల ధరలు పెరగడం కొనసాగుతూనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ససేమిరా అంటున్నాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం ఇంకా పెరగడంతో పాటు ఏప్రిల్ నెలలో కూడా గతంలో ప్రకటించిన అంకెను ప్రభుత్వం మరింతగా పైకి సవరించుకుంది. అంటే ఏప్రిల్ నెలలో ధరలు గతంలో భావించినదాని కంటే ఎక్కువగా పెరిగాయన్నమాట. జూన్ నెలలో (ప్రధాన) ద్రవ్యోల్బణం 9.44 శాతం నమోదయ్యింది. టోకు ధరల సూచి ప్రకారం లెక్కించే ప్రధాన…

అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి…

ఎన్నికలలోపు ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’ -ప్రధాని

మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అనంతరం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు ముగిశాక ప్రధాని మన్మోహన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. మంత్రివర్గ మార్పులు, చేర్పులు అనంతరం అసంతృప్తిపరులు, అసంతుష్టులు ఇంకా ఉండగానే ఆయన “ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’” అని ప్రకటించి ఆహూతులను ఆశ్చర్యపరిచారు. తదుపరి పునర్వ్యవస్ధీకరణలో చోటు దక్కకపోతుందా అని ఆశిస్తున్నవారి ఆశలపై నీళ్ళు జల్లాడు. 2014 ఎన్నికలలోపు, అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే చివరి మార్పులని ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యకరమైన…