ఒక్క వారంలో $2.5 ట్రిలియన్లు నష్టపోయిన ప్రపంచ షేర్ మార్కెట్లు

ఈ ఒక్క వారంలోనే ప్రపంచ షేర్ మార్కెట్లు మొత్తం 2.5 ట్రిలియన్లు నష్టపోయాయని రాయిటర్స్ తెలిపింది. ఇది రు.1.125 కోట్ల కోట్లకు లేదా రు.1,12,50,000 కోట్లకు సమానం. ఫ్రాన్సు వార్ధిక స్ధూల జాతీయోత్పత్తి కూడా సరిగ్గా ఇంతే ఉంటుంది. ఒక ప్రధాన అభివృద్ధి చెందిన దేశ జిడిపితో సమానంగా ప్రపంచ షేర్ మార్కెట్లు ఈ ఒక్క వారంలోనే (ఆగస్టు 1 నుండి 5 వరకు) నష్టపోయాయన్నమాట! ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ “డబుల్ డిప్” వైపుకి మరొక “ది…

భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం

ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -2

(ఒకటవ భాగం తరువాయి) ఇండియాలాగే చైనా కూడా. చైనా, పైకి తన కంపెనీలను ప్రవేటీకరణ చేసినట్లు చూపుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ఈక్విటీ కంపెనీలుగా మారడానికి ఆ దేశం అనుమతించింది. కొన్ని ఈక్విటీలను స్వదేశీ, విదేశీ ప్రవేటు మదుపుదారుల చేతుల్లో పెట్టింది. ఇది పైకి పూర్తిగా ప్రవేటీకరణ జరిగినట్లుగా కనిపించింది. వాస్తవానికి చైనాలొని అన్ని రంగాల కంపెనీల్లో చైనా ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుని ప్రవేటీకరణ కావించిన కంపెనీలపై కూడా తన పట్టు పోకుండా జాగ్రత్త…

అమెరికాను డిఫాల్ట్‌నుండి రక్షించిన బడ్జెట్ కంట్రోల్ ఒప్పందం, ముఖ్య అంశాలు

ద్వైపాక్షిక పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్, అధ్యక్ష భవనం లు ఆగస్టు 1 తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ద్వారా ఒబామా కోరినట్లుగా అమెరికా రుణ పరిమితి పెంచడానికీ, రిపబ్లికన్లు కోరినట్లుగా బడ్జెట్ ఖర్చుల్ని తగ్గించి తద్వరా బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్) తగ్గించడానికి మార్గం సుగమం చేసుకున్నారని పత్రికలు తెలిపాయి. ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు తెలుగు పాఠకుల కోసం ఇక్కడ. రిపబ్లికన్లు, డెమొక్రట్లు పరస్పర అంగీకారంతో ఒక…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -1

అమెరికా రుణ పరిమితి పెంపుదల, బడ్జెట్ లోటు తగ్గింపు లపై ఒప్పందం కుదిరి, ఆ మేరకు బిల్లును ప్రతినిధుల సభ, సెనేట్‌లు ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా బిల్లుపై సంతకం చేసి చట్టంగా అమెరికా మీదికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీదికి వదిలాడు. రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచడం ద్వారా అమెరికా అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అవుతుందన్న భయం తప్పింది. కొత్త అప్పులు చేసి పాత అప్పుల చెల్లింపులు చేయడానికి అవకాశం…

కొనసా……..గుతున్న షేర్ల పతనం

ఈ వారం మూడవ రోజు కూడా బారత షేర్లు పతన బాటలో కొనసాగాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ప్రధాన షేర్ల సూచీలు దాదాపు ఒక శాతం నష్టాలు చవిచూశాయి. అమెరికా రుణ పరిమితి పెంపు పైనా, బడ్జెట్ లోటు తగ్గింపు పైనా అక్కడి చట్ట సభలు, వైట్ హౌస్ లు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ మార్కెట్లు లేదా మదుపుదారులు సంతృప్తి చెందలేదు. రుణ పరిమితి పెంపు, బడ్జెట్ లోటు తగ్గింపు లకు సంబంధించిన చర్చలు సుదీర్ఘ కాలంపాటు…

కొనసాగుతున్న షేర్ల పతనం

భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.…

అమెరికా రుణ పరిమితి పెంపుకు ఒప్పందం, ప్రతినిధుల సభ ఆమోదం

ఆగస్టు 2 లోగా అమెరికా రుణ పరిమితిని పెంచుతూ చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్న నేపధ్యంలో అనేక వారాల పాటు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఎట్టకేలకు, అమెరికా ప్రతినిధుల సభ లోని డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ మధ్య ఆగస్టు 1 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన “ది బడ్జెట్ కంట్రోల్ యాక్ట్ 2011” ను  సభ్యులు 269-161 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన…

మరింత క్షీణిస్తున్న భారత ఆర్ధిక వృద్ధి, లక్ష్య సిద్ధి అనుమానమే

భారత దేశ ఆర్ధిక వృద్ధి మరింత క్షీణిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గిపోతుండడంతో జి.డి.పి వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే తక్కువే నమోదు కావచ్చని ప్రభుత్వంలోని ఆర్ధిక సంస్ధలు, పరిశీలకులు భావిస్తున్నారు. దానితో గతంలో విధించుకున్న జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. జి.డి.పి వృద్ధితో పాటు మార్చి 2011 నాటికి చేరాలని భావిస్తున్న బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్), ద్రవ్యోల్బణం తదితర లక్ష్యాలను కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది.…

ప్రతిపక్షాల కుంభకోణాలకేమీ తక్కువలేదు, మాకేం భయం? -ప్రధాని

అటు పాలక పక్షాలు, ఇటు ప్రతిపక్షాలూ… ఎవర్ని కదిలించినా తాము “సాధు పుంగవులమ”నే అంటారు. “కోరికలసలే లేక ప్రజాసేవలో తరించవచ్చిన సన్యాసులమే” అంటారు. మరే! రాజకీయ నాయకులు వారు చెప్పుకున్నట్లు కోరికలు లేని సన్యాసులే. అపుడు ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలేది బూడిదే’ అన్నది పాతకాలపు సామెత గా రద్దవుతుంది. ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలతాయి బోలెడు కుంభకోణాలు’ అన్నది ఆధునిక నియమంగా స్ధిరపడుతుంది. ప్రధాని మన్మోహన్ వెల్లడించిన ధైర్యంలో ఆ సంకేతాలే కనపడుతున్నాయి. సోమవారం వర్షాకాల…

పోస్టాఫీసులు రద్దు చేసి బ్యాంకులు నెలకొల్పుతాం -కపిల్ సిబాల్

దేశ వ్యాపితంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫిసులపై ప్రవేటీకరణ మంత్రుల కన్నుపడింది. ప్రభుత్వంలో ప్రవేటీకరణ కోసం, నూతన ఆర్ధిక విధానాలను వేగంగా అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది మంత్రులను ప్రధాని మన్మోహన్ నియమించుకున్నాడు. వారిలో కపిల్ సిబాల్ ఒకరు. ఈయన పూర్వాశ్రమంలో సుప్రీం కోర్టులో పేరు మోసిన న్యాయవాది. అమెరికా పాలకులకు ఇష్టుడు. 2జి కుంభకోణం వలన ప్రభుత్వానికి రు.176,000 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని భారత అత్యున్నత ఆడిటింగ్ సంస్ధ చెప్పగా, కపిల్ సిబాల్…

అమెరికా కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉంది!

ప్రస్తుతం అమెరికా కోశాగార విభాగం కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉన్న సంగతి వెల్లడయ్యింది. తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వద్ద ఆపరేటింగ్ ఖర్చుల కోసం 73.7 బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. ఐఫోన్, ఐప్యాడ్ ల సృష్టికర్త యాపిల్ కంపెనీ అత్యంత తాజాగా వెల్లడించిన ఫైనాన్షియల్ ఫలితాల ప్రకారం కంపెనీ వద్ద 76.4 బిలియన్ డాలర్లు ఉంది. అంటే అమెరికా కోశాగారం కంటే 2.7 బిలియన్ డాలర్లు యాపిల్ కంపెనీ…

అమెరికా ఆర్ధిక వృద్ధి అనుకున్నదానికంటే ఘోరం

అమెరికా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండవ క్వార్టర్‌లో (ఏప్రిల్ నుండి జూన్ 2011 వరకు) అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 1.3 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది కూడా వార్షిక రేటు మాత్రమే. క్వార్టరులో చూస్తే 0.35 శాతమే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రెండో క్వార్టర్ లో వృద్ధి చెందింది. ఇంకా ఘోరం ఏమిటంటే, మొదటి క్వార్టర్ లో (జనవరి నుండి మార్చి 2011 వరకు) అమెరికా…

ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్

రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…

అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?

అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి…