జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం

క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఆర్ధిక పరిణామాలను అధారం చేసుకుని మాత్రమే రేటింగ్ ఇవ్వవలసి ఉండగా, రాజకీయ పరిస్ధితుల ఆధారంగా కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లుంది. ఎడతెగని రాజకీయ సంక్షోభం రీత్యా జపాన్ క్రెడిట్ రేటింగ్ ను ఒక మెట్టు తగ్గించింది. జపాన్ లో గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధానులు పని చేశారు. ఇప్పటి ప్రధాని కూడా ఆగస్టు నెలాఖరుకు పదవు నుండి తప్పుకోబోతున్నాడు. భూకంపం, సునామీలకు సమర్ధవంతంగా, వేగంగా స్పందించడంలో విఫలమైనాడని అందరూ భావిస్తుండడంతో…

ఐ.ఎం.ఎఫ్, ఇయు షరతుల ఫలితం, ఐర్లండు ప్రజలపై త్వరలో మరో విడత బాదుడు

బెయిలౌట్ మంజూరు చేస్తూ ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు విధించిన షరతులతో పాటు రేటింగ్ ఏజన్సీలు, వివిధ బ్యాంకుల ఆర్ధికవేత్తల ఒత్తిడి పెరగడంతో ఐర్లండు ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులపై మరో విడత కోతలు, పన్నులు బాదడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం నవంబరు నెలలో ఐర్లండు రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో (చెల్లించగల వడ్డి రేట్లకు మార్కెట్లో అప్పు సేకరించలేని స్ధితి) ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా 67.5 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేస్తూ విషమ షరతులు విధించాయి. కార్మికులు,…

ఇండియా, బెలారస్ ల ఎరువుల ఒప్పందానికి మోకాలడ్డిన అమెరికా?

ఇండియా, బెలారస్ ల మధ్య పొటాష్ ఎరువులకు సంబంధించి కుదిరిన ఒప్పందానికి అమెరికా మోకాలడ్డినట్లు అనుమానాలు తలెత్తాయి. కేబినెట్ నిర్ణయాలను అమెరికాకి చేరవేయడానికి భారత ప్రభుత్వ కేబినెట్ లో అమెరికా ఏజెంటు ఉన్న అనుమానాలు కూడా వాటికి జత కలిశాయి. పాత సోవియట్ రాజ్యం బెలారస్‌లోని పొటాషియం గనులను కొనాలనీ, అలాగే విదేశాలలో ఎరువుల గనులను ప్రాధామ్యం ప్రాతిపదికన సొంతం చేసుకోవాలని కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా ఒక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన రోజునే బెలారస్ పై…

రాజకీయ పార్టీల నిధుల సేకరణను దెబ్బతీసిన అమెరికా రుణ సంక్షోభం -కార్టూన్

అమెరికా రుణ సంక్షొభం ప్రభావం అన్ని రంగాల మీదా పడుతోంది. 2012లో జరగనున్న ఎన్నికల కోసం నిధుల సేకరణకు అమెరికా రాజకీయ పార్టీలు ఇప్పటినుండే నిధులు సేకరిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ, ప్రభుత్వ ఖర్చు ఎక్కువయ్యిందని చెబుతూ ప్రజలపైన కఠినమైన పొదుపు విధానాలను రుద్దుతోంది. అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీకి నిధుల లభ్యత విషయంలో సమస్యలు ఎదుర్కోక పోవచ్చు. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ సమస్యలు తప్పవు. నిధుల సేకరణ విషయంలో వారికి సమస్యలు ఎదురవ్వుతాయని చెబుతూ, ఈ…

ఈ వారంలో భారిగా నష్టపోయిన షేర్ మార్కెట్లు

ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో భారత షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధిపై అనుమానాలు తీవ్రం అయ్యాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మార్కెట్లకు సెలవు. మంగళవారం ప్రారంభమయిన షేర్ మార్కెట్లలో బి.ఎస్.ఇ సెన్సెక్స్ 17055.99 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు శుక్రవారంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 16141.67 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.…

“అప్పు” పై యుద్ధంలో అమెరికా, యూరప్ లకు చైనా సహాయం -కార్టూన్

యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా రుణ సంక్షోభంలో ఉన్న సంగతి విదితమే. యూరోపియన్ రుణ సంక్షోభం ఫలితంగా గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు దివాలా అంచుకు చేరాయి.స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్సులు సంక్షోభం బాటలో ఉన్నాయి. బ్రిటన్, జర్మనీల పరిస్ధితి కూడా ఏమంత ఘనంగా లేదు. ఇటీవల యూరప్ పర్యటించిన చైనా ప్రధాని, రుణ సంక్షోభం నుండి బైటికి రావడానికి సహాయం చేయడానికి చైనా రెడీ అని హామీ ఇచ్చాడు. అమెరికా అప్పులో దాదాపు రెండు ట్రిలియన్ల వరకు…

హజారేకు అమెరికా మద్దతు వెనక ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ అనుమానం

బుధవారం కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధించింది. అన్నా హజారే శాంతియుత నిరసన దీక్ష పట్ల భారత ప్రభుత్వం తగువిధంగా ప్రజాస్వామ్యబద్ధమైన సంయమనం పాటిస్తుందని ఆశిస్తున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అమెరికా తన వొంటి నలుపుని పక్కనబెట్టి నలుపు మచ్చల్ని వెతకడానికి ప్రయత్నించడం మామూలు విషయం. ప్రపంచ దేశాల్లో తన రాయబార కార్యాలయాల్ని గూఢచర్యానికి కేంద్రాలుగా మార్చిన వైనాన్ని బైటపెట్టిన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మేనింగ్ ని చీకటి కొట్టంలో పడేసి చిత్ర హింసలు…

కొత్త ప్రమాదం ముంగిట ప్రపంచ మార్కెట్లు -ప్రపంచ బ్యాంకు

గత కొద్ది వారాలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కొత్త ‘డేంజర్ జోన్’ ముంగిట నిలిపాయని ప్రపంచ బ్యాంకు అధిపతి రాబర్ట్ జోయెలిక్ హెచ్చరించాడు. 1. అమెరికా, యూరప్ ల లాంటి కీలక దేశాల్లో ఆర్ధిక నాయకత్వంపై మార్కెట్ విశ్వాసం సన్నగిల్లడం, 2. పెళుసైన ఆర్ధిక రికవరీ… ఈ రెండు అంశాలు కలిసి మార్కెట్లను కొత్త ప్రమాదంలోకి నెట్టాయని ఆయన వ్యాఖ్యానించాడు. వివిధ దేశాల్లోని విధాన కర్తలు దీనిని తీవ్రంగా పరిగణించాలని జోయెలిక్ కోరాడు. సిడ్నీలో ఆదివారం…

స్పెయిన్ రుణ సంక్షోభం, పొదుపు చర్యలకు బలౌతున్న జనం -కార్టూన్

యూరో జోన్ లో (యూరోను కరెన్సీగా అంగీకరించిన యూరప్ దేశాలు) రుణ సంక్షోభంలో ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరుతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై పొదుపు బడ్జెట్ నీ, పొదుపు ఆర్ధిక విధానాలనీ ప్రజలపై రుద్ధుతోంది. ఇప్పటికే సగం చచ్చి ఉన్న కార్మికులు, ఉద్యోగులపై మరిన్ని కోతలు, రద్దులు ప్రకటించడంతో వారి కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. బ్యాంకులు, కంపెనీలకు పన్నుల రాయితీలు కొనసాగిస్తూ, వీలతై మరిన్ని రాయితీలిస్తూ, ప్రజలపైన పన్నులు బాదుతున్నారు. ఇది…

ధనికుడి ఆర్ధిక సంక్షోభం, దరిద్రుడి ఆకలి సంక్షోభం -కార్టూన్

ప్రపంచం ఇప్పుడు సంక్షోభాలతో నిండిపోయింది. ఏ పత్రిక చూసినా, ఏ ఛానెల్ చూసినా అమెరికా రుణ సంక్షోభం, యూరప్ రుణ సంక్షోభం, రుణ సంక్షోభం ఆసియాను తాకుతుందా? చైనా, ఇండియాల పరిస్ధితి ఏమిటి? జర్మనీ, ఫ్రాన్సులు యూరప్‌ని ఒడ్డుని చేరుస్తాయా? ఈ ప్రశ్నలే ఎల్లెడలా! వీటన్నింటికీ అతీతంగా సర్వకాల సర్వావస్ధల యందు కూడా ఆకలి సంక్షోభం లో ఉన్నవారి సంగతి ఎవరికీ పట్టదు, అప్పుడప్పుడూ వచ్చే పరిశోధనాత్మక వ్యాసాలు తప్ప. 2008 ఆర్ధిక సంక్షోభం రాగానే ప్రపంచ…

ఫ్రాన్సును తాకిన యూరప్ రుణ సంక్షోభం, యూరోజోన్ ఉనికికే వచ్చిన ప్రమాదం

యూరోజోన్ గ్రూపుకి ఉన్న రెండు ప్రధాన స్తంభాల్లో ఒకటైన ఫ్రాన్సును రుణ సంక్షోభం తాకింది. ఫ్రాన్సు తన క్రెడిట్ రేటింగ్ AAA రేటింగ్ ని కోల్పోవచ్చన్న ఊహాగానాలు రాను రానూ బలంగా మారుతున్నాయి. మూడు ప్రధాన క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఫిచ్, ఎస్&పి, మూడీస్ లు ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కి ఇప్పుడప్పుడే వచ్చిన ప్రమాదం ఏమీ లేదని హామీ ఇస్తున్నప్పటికీ మార్కెట్లు వినిపించుకునే స్దితిలో లేనట్లు కనిపిస్తున్నది. లండన్ అల్లర్లకు బ్రిటన్ ప్రధాని కామెరూన్ తన…

మూడు దశాబ్దాల కనిష్ట స్ధాయికి పడిపోయిన అమెరికా వినియోగదారుల విశ్వాసం

ఆగష్టు నెలలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధపై వినియోగదారుల విశ్వాసం మూడు దశాబ్దాల కనిష్ట స్ధాయికి పడిపోయిందని ధామ్సన్ రాయిటర్స్ / మిచిగాన్ యూనివర్సిటీ వినియోగదారుల సెంటిమెంట్ సూచి తెలిపింది. సూచి ప్రకారం జులై నెలలో సెంటిమెంట్ 63.7 శాతం నుండి 54.9 శాతానికి పడిపోయింది. మార్కెట్ అంచనా ప్రకారం ఇది 62 శాతానికి తగ్గవలసి ఉండగా, అంచనాలను తలదన్నుతూ కనిష్ట స్ధాయికి పడిపోవడం గమనార్హం. 1980 ఆగష్టు నెల తర్వాత ఈ స్ధాయికి పడిపోవడం ఇదే ప్రధమం…

రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ ప్రభావం నుండి తేరుకుని మంగళవారం అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు చవి చూశాయి. కాని ఆ ఆనందం బుధవారానికి అవిరైపోయింది. యూరోజోన్‌లో రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగి ఉన్న ఫ్రాన్సు కూడా యూరప్ అప్పు సంక్షొభం బారిన పడనుందని అనుమానాలు బలంగా వ్యాపించాయి. దానితో యూరప్, అమెరికా ల షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు గురైనాయి. రుణ సంక్షోభం దరిమిలా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోతుందన్న…

మార్కెట్ల విధ్వంసంపై ఇన్‌వెస్టర్ల హావ భావాలు -ఫోటోలు

గత శుక్రవారం అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఎస్‌&పి క్రెడిట్ రేటింగ్ సంస్ధ అత్యున్నత రేటింగ్ AAA నుండి రెండో అత్యున్నత రేటింగ్ AA+ కి తగ్గించింది. దానితో అమెరికా ప్రభుత్వం, కంపెనీలు, వినియోగదారులకు అప్పుల ఖరీదు (వడ్డీ రేటు) పెరిగిపోయింది. దానివలన పెట్టుబడులు తగ్గి, అప్పటికే అనేక బలహీనతలతో తీసుకుంటున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింత క్షీణిస్తుందనీ, అమెరికా మరొక సారి మాంద్యానికి (రిసెషన్) గురై అది ప్రపంచం అంతా వ్యాపిస్తుందనీ ఒక్క సారిగా భయాలు ఇన్‌వెస్టర్లను…