కుప్ప కూలిన షేర్లు, బ్లూఛిప్స్‌తో సహా ఒక్క రోజులోనే 2.15 లక్షల కోట్లు నష్టం

గురువారం షేర్ మార్కెట్లు మదుపుదారులకు చుక్కలు చూపించాయి. మూడు సంవత్సరాల క్రితం నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చాయి. గత 26 నెలల్లోనే ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్ సూచి 704 పాయింట్లు నష్టపోయింది. మొత్తం షేర్ల విలువలో చూసినట్లయితే షేర్లలో ఉన్న మదుపుదారుల సొమ్ము రు.2.15 లక్షల కోట్లు ఒక్కరోజులో అదృశ్యమైంది. చిన్న కంపెనీల షేర్ల కంటే బ్లూచిప్ కంపెనీల షేర్లు ఉన్నవారే అత్యధికంగా నష్టపోవడం విశేషం. లిస్టెడ్ షేర్ల విలువ బుధవారం…

నిలువునా కూలిన భారత షేర్లు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావం

గురువారం భారత్ షేర్ మార్కెట్లు నిలువునా కుప్పకూలాయి. మూడు శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా సంపాదించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆసియా మార్కెట్లనుంది ప్రతికూల సంకేతాలు అందడం, అమెరికా ఆర్ధిక వృద్ధిపై ఫెడరల్ రిజర్వు ప్రతికూల దృశ్యాన్ని ఆవిష్కరించడం తదితర ప్రపంచ స్ధాయి సంకేతాలు భారత షేర్ మార్కెట్లను కూల్చివేశాయి. దాదాపు అన్ని లిస్టెడ్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. లోహాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఐదు శాతం వరకూ పతనమయ్యాయి.…

2జి స్పెక్ట్రం కుంభకోణంలో పీకలలోతుల్లో చిదంబరం?

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం మెడ చుట్టూ 2జి స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల కేటాయింపు కుంభకోణం ఉరి బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రికి రాసిన నోట్‌ను బట్టి స్పెక్ట్రం ధరలను అతి తక్కువగా నిర్ణయించడంలో చిందంబరం పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. ఆర్ధిక మంత్రిత్వ శాఖనుండి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన రహస్య నోట్ పైన ఆధారపడి జనాతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి,…

2జి స్పెక్ట్రం కేటాయింపులపై చిదంబరం ప్రధానికి రాసిన నోట్ ఇదే

2జి స్పెక్ట్రం కేటాయిస్తూ అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా 122 లైసెన్సులు జారీ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు జారీ చేసిన ఐదు రోజుల తర్వాత చిదంబరం ప్రధానికి ఈ నోట్ పంపాడు. దానిలో జరిగింది వదిలేద్దామని, ఇక ముందు జాగ్రత్తపడదామనీ చిదంబరం, ప్రధానికి సూచించాడు. వాస్తవానికి అప్పటికి ప్రధాని, ఆర్ధిక మంత్రి తలచుకున్నట్లయితే ఎ.రాజా లైసెన్సులు జారీ చేయకుండా అడ్డుకోగల అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జనవరి 10 నాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్…

ఎ.రాజా 2జి స్పెక్ట్రం కేటాయింపులు చిదంబరం, మన్మోహన్‌లు తెలిసీ అమోదించారు

2జి స్పెక్ట్రం లైసెన్సులను అతి తక్కువ ధరలకు కేటాయించిన విషయం అప్పటి ఆర్ధిక మంత్రి, ప్రధాని మన్మోహన్ లకు తెలిసే జరిగిందని ఫస్ట్ పోస్ట్ వెల్లడించిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఆర్.టి.ఐ చట్టం ద్వారా ఫస్ట్ పోస్ట్ వెబ్ మ్యాగజైన్ ప్రధాన మంత్రికి 2జి కేటాయింపులపై చిదంబరం రాసిన నోట్‌ను సంపాదించింది. 122 2జి స్పెక్ట్రం లైసెన్సులను వివాదాస్పద రీతిలో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా కేటాయించిన ఐదురోజుల తర్వాత చిదంబరం ఒక నోట్ ను ప్రధానికి…

కార్పొరేట్ కంపెనీల అధిపతుల నెల జీతాలు కోట్లపైనే

2004-05 లెక్కల ప్రకారం పట్టణాల్లో తలకు రోజుకి రు.20/, గ్రామాల్లో తలకు రు.15/ సంపాదిస్తున్నట్లయితే వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని ప్రణాళికా సంఘం కోర్టుకి అఫిడవిట్ సమర్పించడం పట్ల వివిధ వర్గాలు, సంస్ధలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దారిద్ర్య రేఖను కృత్రిమంగా కిందికి జరిపి దరిద్రుల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనీ, తద్వారా ప్రభుత్వం సబ్సిడీ అందించాల్సిన వారి సంఖ్యను తగ్గించడానికీ, బాధ్యతనుండి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తున్నదని నిపుణులు ఆరోపించారు. ప్రణాళికా సంఘం సభ్యులు కొందరు…

భారత ప్రజల్లో 40 కోట్లమంది దరిద్రులు, అదీ నెలకి వెయ్యి రూ.ల లెక్కన

భారత ప్రణాళికా సంఘం కొన్ని నిజాలను సుప్రీం కోర్టుకి తెలిపింది. భారత ప్రణాళిక సంఘం ఎవరిని దరిద్రులుగా లెక్కిస్తున్నదో కూడా వెల్లడించింది. ప్రణాళిక సంఘం దారిద్ర్య ప్రమాణాలను చూస్తే ముక్కు వేలు వేసుకోవలసిందే. మొత్తం 120 కోట్ల జనాభాలో 40.74 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ఎవరిని దరిద్రులుగా భావిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చూస్తే, పట్టణాలలో నెలకు రు.965/- (రోజుకి 32/-)కు తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులు కాగా, గ్రామాల్లో నెలకు…

ఒబామా ఉద్యోగాల వంటకం -కార్టూన్

అమెరికాలో నిరుద్యోగం 9.1 శాతం అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నప్పటికీ వాస్తవానికి అది 16 శాతంపైనే ఉంటుందని ఆర్ధికవేత్తలు దాదాపుగా ఏకీభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం నాటి ఆర్ధిక మాంద్యం నుండి కోలుకున్నామని చెబుతున్నప్పటికీ ఈ రికవరీ వాస్తవానికి ఉద్యోగాలు ఏమీ కల్పించలేకపోయింది. ఉద్యోగాల సృష్టి లేని రికవరీ వాస్తవానికికి రికవరీగా పరిగణించలేము. అందుకే అమెరికా రికవరీని జాబ్‌లెస్ రికవరీగా పేర్కొంటున్నారు. ఉపాధి కల్పించకుండా ఆర్ధిక వృద్ధి సాధించడం అసాధ్యమని ఐ.ఎం.ఎఫ్ అనేకసార్లు చెప్పిన…

మూలిగే నక్కపై తాటికాయ, ఇటలీ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన ఎస్&పి

చరిత్రలో మొదటిసారిగా అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించిన స్టాండర్డ్ & పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ రుణ సంక్షోభంతో తల్లడిల్లుతున్న యూరో జోన్‌ను బండరాయితో మోదినంత పని చేసింది. మంగళవారం, యూరోజోన్ లో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటైన ఇటలీ క్రెడిట్ రేటింగ్‌ను ఒక అడుగు తగ్గించింది. ఎవరూ ఊహించని ఈ చర్యతో యూరోజోన్ రుణ సంక్షోభాన్ని మరింత తీవ్రం కానుంది. యూరోజోన్ దేశాల ప్రభుత్వాలపై సమస్య పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకొనేలా ఈ చర్య ఒత్తిడి…

రూపాయి విలువ అడ్డం పెట్టుకుని మోస పూరితంగా పెట్రోల్ రేట్లు పెంచిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్ ధరలను లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే తగ్గిపోయినందున కంపెనీలు దిగుమతులకు ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదనీ దానివలన నష్టాలు పెరిగాయనీ కారణం చూపి ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచింది. కాని వాస్తవానికి రూపాయి విలువ తగ్గుదల తాత్కాలిక పరిణామమేననీ కొద్దిరోజుల్లోనే రుపాయి పూర్వ విలువను పొందుతుందనీ ప్రభుత్వ అధికారులే నాలుగురోజుల క్రితం ప్రకటిన సంగతి గమనిస్తే, ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అబద్ధాలు…

ఆర్.బి.ఐ రేట్ల పెంపుతో పతనమైన షేర్ మార్కెట్

శుక్రవారం జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక సారి వడ్డీ రేట్లను పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పడం లేదనీ, ద్రవ్యోల్బణం కట్టడి చేయడమే తమ ప్రధమ కర్తవ్యమనీ ఆర్.బి.ఐ గవర్నర్ మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. వడ్డీ రేట్ల పెంపుదల జిడిపి పెరుగుదల రేటుకు ప్రతికూలంగా పరిణమించడంతో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు పెంచడం కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని ప్రధాని ఆర్ధిక…

సొరంగం చివర వెలుగును చూస్తున్న యూరో -కార్టూన్

అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన…

గ్రీసు రుణ సంక్షోభం -కార్టూన్

గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే  కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్ —————                   —————–                          ————–                       —————— గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు,…

నూతన ఎత్తులను తాకుతున్న అమెరికా దరిద్రం -సెన్సస్ బ్యూరో

అమెరికా సెన్సస్ బ్యూరో తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పుడు అమెరికాలో ప్రతి ఆరుగురిలోనూ ఒకరు దరిద్రుడు. బ్యూరో విడుదల చేసిన 2010 గణాంకాల ప్రకారం అమెరికాలో 46.2 మిలియన్ల మంది (4.62 కోట్లు) దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారు. అంటే మొత్తం జనాభాలో 15.1 శాతం మంది దరిద్రులుగా బతుకులీడుస్తున్నారు. ఇది 2009 సంవత్సరంలో 14.3 శాతంగా ఉంది. ఒక సంవత్సరంలో 0.8 శాతం (2.5 మిలియన్లు లేదా 25 లక్షలు)…

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల పొదుపు విధానాల అమలు ప్రభావం బ్రిటిష్ పౌరుల కుటుంబ బడ్జెట్‌లను బాగా కుచించివేసిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్’ చేసిన అధ్యయనంలో…