తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభం, గొడవ, వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే. శాసనసభ…

విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం

సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను…