‘వేడి వేసవులే’ ‘తీవ్ర శీతలాలకి’ కారణం

ఉత్తరార్ధ గోళంలో వేడి వేసవి కాలాలు అమెరికా, యూరప్ లలో తీవ్ర చలితో కూడిన శీతాకాలాలకు కారణం అవుతున్నాయని అమెరికా అధ్యయన సంస్ధ ఒకటి తెలిపింది. ‘ఎన్విరాన్‌మెంటల్ రీసర్చ్ లెటర్స్’ అనే పత్రికలో శుక్రవారం  ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. మంచు తుఫాన్లు, శీతాకాలంలో తీవ్రమైన చలితో కూడిన టెంపరేచర్లు గత రెండు సంవత్సరాలలో అమెరికా, యూరప్ లలోని కొన్ని ప్రాంతాల్లో అనేక సమస్యలను సృష్టించాయి. భూమి వేడెక్కుతోందని ఓ పక్క శాస్త్రవేత్తలు గోలపెడుతుండగా ఎదురుగా ఎవరున్నదీ…