తన మిలట్రీ కాంట్రాక్టుల్లో చైనా కంపెనీలు ప్రవేశించకుండా నిషేధించిన అమెరికా

అమెరికా జారీ చేసే మిలట్రీ కాంట్రాక్టులకు చైనాకి చెందిన కంపెనీలు బిడ్ లు దాఖలు చేయకుండా నిషేధిస్తూ అమెరికా చట్టాని ఆమోదించింది. అంతర్గత భద్రత దృష్యా చైనా కంపెనీలు తమ మిలట్రీ కాంట్రాక్టులకు ప్రయత్నించడం తమకు సమ్మతం కాదని అమెరికా ప్రతినిధుల సభ ఈ చట్టం ద్వారా తేల్చి చెప్పింది. అమెరికా డిఫెన్సు బడ్జెట్ బిల్లును ఆమోదిస్తున్న సందర్భంగా అమెరికా కాంగ్రెస్ చైనా కంపెనీల నిషేధ బిల్లును కూడా బుధవారం ఆమోదించింది. తాజా బిల్లు అమెరికా, చైనాల…

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆయుధ పోటీ -చైనా శ్వేతపత్రం

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలొ అమెరికా ఆయుధ పోటీ పెంచుతున్నదని చైనా అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వం జారీ చేసిన ‘జాతీయ రక్షణ శ్వేత పత్రం’ లో చైనా, దాని చుట్టూ ఉన్న రక్షణ పరిస్ధితులను విశ్లేషించింది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలట్రీ ఉనికి పెరుగుతున్నదని శ్వేత పత్రం తెలిపింది. ఈ ప్రాంతంలోని సైనిక చర్యలు అంతిమంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడి ఉన్నాయని పత్రం తెలిపింది. భద్రతాంశాలపై చైనా దృక్పధాన్నీ, తన రక్షణ బలగాల గురించిన సమగ్ర దృక్పధాన్ని శ్వేత పత్రం…