ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన అన్నా హజారే, మరోసారి ఆమరణ నిరాహార దీక్ష
కేంద్ర ప్రభుత్వ వైఖరితో అన్నా హజారే విసుగు చెందాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి ఏప్రిల్ లో ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే, మరునాటి నుండే పౌర సమాజ కార్యకర్తలపై కేంద్ర మంత్రులు వివిధ ఆరోపణలతో దాడి ప్రారంభించడంతో ఖిన్నుడయ్యాడు. శాంతి భూషణ్, ఆయన కొడుకు ప్రశాంత్ భూషన్ ఇరువురూ కమిటీలో ఉండడం పట్ల మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు తర్వాత శాంతి భూషణ్ పై అవినీతి ఆరోపణను ఎక్కడో పాతాళం నుండి…