ఇద్దరు స్త్రీలను రేప్ చేసి తర్వాత హత్యాకాండ జరిపారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ
హత్యాకాండ జరిగిన రాత్రి అమెరికా సైనికులు జరిపిన అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా సైనికులు హత్యాకాండకి ముందు ఇద్దరు ఆఫ్ఘన్ స్త్రీలను రేప్ చేసి అనంతరం హత్యాకాండ జరిపారని పార్లమెంటరీ విచారణ కమిటీ సభ్యులు, శనివారం ఆఫ్ఘన్ పార్లమెంటులో ప్రకటించారు. హత్యాకాండలో చనిపోయిన నలుగురు స్త్రీలలో రేప్ కి గురికాబడిన ఇద్దరు స్త్రీలు ఉన్నారని కమిటీ సభ్యులు పార్లమెంటుకి తెలియజేశారు. జంగాబాద్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని మందుపాతరతో పేల్చివేసినందుకు ప్రతీకారంతోనే అమెరికా సైనికులు ఈ…




