అమెరికా ప్రతీకారం: కరెన్సీ సమస్యతో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలు
తాలిబాన్ పాలనపై అమెరికా పాల్పడుతున్న ప్రతీకార చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర సంక్షోభం లోకి నెట్టివేస్తున్నాయి. పశ్చిమ దేశాల నుండి ఇప్పటిదాకా అందుతూ వచ్చిన సహాయాన్ని నిలిపివేయడంతో పాటు ఆఫ్ఘన్ దేశానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు రిజర్వు నిధులను కూడా అందకుండా నిషేధం విధించడంతో ఉన్నత స్ధాయీ ప్రభుత్వాధికారుల నుండి అత్యంత కడపటి పౌరుడు సైతం తిండికి, ఇతర కనీస సౌకర్యాలకు కటకటలాడుతున్నారు. తాలిబాన్ డబ్బు సమస్య ప్రధానంగా అమెరికా ట్రెజరీ విభాగం స్తంభింపజేసిన ఆఫ్ఘన్…



