ఆఫ్ఘన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జర్మన్ల ప్రదర్శన

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాదిమంది జర్మన్లు శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జర్మనీ వ్యాపితంగా ఉన్న డెబ్బై పైగా నగరాలలో పదుల వేలమంది జర్మన్లు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని ప్రెస్ టి.వి. తెలిపింది. సాంప్రదాయక ఈస్టర్ ‘పీస్ మార్చ్’ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో, ప్రదర్శకులు నాటో దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. రాజధాని బెర్లిన్ లో  అమెరికా ఎంబసీ ముందు వందలమంది నిరసనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్ధాన్ లోనూ, పశ్చిమాసియాలోనూ అమెరికా అనుసరిస్తున్న…

తాలిబాన్ చేతిలో మరో నలుగురు అమెరికా సైనికులు హతం

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో తాలిబాన్ మిలిటెంట్ల బాంబు దాడిలో బుధవారం మరో నలుగురు అమెరికా సైనికులు చనిపోయినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. సాపేక్షికంగా తాలిబాన్ కి బలం లేదని భావించే ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్ లోని ఫార్యబ్ రాష్ట్రంలో ఈ దాడి చోటు చేసుకుంది. నాటోకి చెందిన ఐ.ఎస్.ఏ.ఎఫ్ (ఇంటర్నేషనల్ సెక్యూరిటి ఆసిస్టెన్స్ ఫోర్స్) మాత్రం ఇద్దరు సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఫార్యబ్ బాంబు దాడుల్లో మరణించినవారు తమ లెక్కలో లేరని ఐ.ఎస్.ఏ.ఎఫ్ తెలిపింది. ఈ లెక్కన…

యుద్ధాలు శా(శ్వా)సించేవారు రాజనీతిజ్ఞులు, యుద్ధం చేసే సైనికులు పిచ్చోళ్ళు?!

ఆఫ్ఘనిస్ధాన్ లో అమాయక పౌరుల ఇళ్ళల్లో జొరబడి నిద్రలో ఉన్న 16 మంది ని కాల్చి చంపిన అమెరికా సైనికుడు వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమా వద్దగల ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి వచ్చాడు. ఈ స్ధావరాన్ని ‘లూయిస్ మెక్-కార్డ్’ బేస్ గా పిలుస్తారు. ఈ స్ధావరం నుండి వచ్చిన సైనికులు గతంలో కూడా ఇలాంటి హత్యాకాండలకి పాల్పడ్డారనీ, అసలా స్ధావరంలోనే ఏదో ఉందనీ పశ్చిమ దేశాల పత్రికలు కధనాలు రాస్తున్నాయి. 2010 లో కూడా…