టెర్రరిజం సాకుతో ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేస్తున్నారు -ఆఫ్ఘన్ అధ్యక్షుడు
‘టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని’ చెబుతూ అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా విమర్శించాడు. అధ్యక్ష భవనం వద్ద గురువారం ప్రసంగిస్తూ హమీద్ కర్జాయ్, అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను చంపుతున్నారనీ, పౌరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారనీ, ఆఫ్ఘన్ జాతీయులను తమ జైళ్ళలో అక్రమంగా నిర్భంధిస్తున్నారనీ అమెరికా తో పాటు దాని మిత్ర దేశాలు కూడా యధేచ్ఛగా దుర్మార్గాలు సాగిస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించాడు. 2014 తర్వాత కూడా మరో…
