తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?

‘ఏసియా టైమ్స్’ ఆన్‌లైన్ ఎడిషన్‌కి సంపాదకుడుగా ఉన్న పాకిస్ధాన్ విలేఖరి సలీమ్ షాజద్ కిడ్నాప్‌కి గురై, ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని శరీరంపై చిత్ర హింసలకు గురైన ఆనవాళ్ళు తప్ప బలమైన గాయమేదీ కనిపించలేదు. తుపాకితో కాల్చిన గుర్తులసలే లేవు. ఎటువంటి గాయాలు కనిపించకుండా చంపగల నేర్పరితనం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. షాజద్ హత్య ద్వారా ఆ నేర్పరితనం ఐ.ఎస్.ఐ గూఢచారులకు కూడా ఉందని వెల్లడయ్యింది. షాజద్‌ని చంపింది…