లుక్ ఆఫ్రికా & లాటిన్ అమెరికా, ఇండియా కొత్త నినాదం?
ఒకటిన్నర దశాబ్దం క్రితం ‘లుక్ ఈస్ట్’ విధానం ప్రకటించి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పిన భారత పాలకులు ఇప్పుడు వెనక్కి కూడా చూపు తిప్పినట్లు కనిపిస్తోంది. నమీబియాలో పర్యటిస్తున్న భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ 100 మిలియన్ డాలర్ల (రు. 620 కోట్లు) కొనుగోలు రుణం ఆ దేశానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. Buyer’s credit గా పేర్కొనే ఈ రుణం ద్వారా నమీబియా, ఇండియా నుండి దిగుమతులు చేసుకోవడానికి ప్రోత్సహించడం భారత్ లక్ష్యం.…

