1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in) ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:   సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి…

85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద

పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త! ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో మొట్ట మొదటి 85 మంది సమాజ సేవలో తరించిపోతున్నారు. ఎంతగా తరించిపోతున్నారంటే వారి సంపదలు కింది భాగంలో ఉన్న 350 కోట్ల మంది సంపదలతో సమానం అయ్యేంతగా. వీరి ప్రజా సేవ వల్ల తమ సంపదలు అంతులేకుండా పెరిగిపోతుంటే వీరి సేవలు అందుకుంటున్న సోమరిపోతుల సంపద మాత్రం తీవ్రంగా తరిగిపోతోంది. ఈ 85 మంది గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నారో తెలిసే మార్గం…

సంక్షోభాల్లో సైతం పెట్టుబడిదారుల లాభాలకు కొదవలేదు

2008 ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా కోలుకోనే లేదు. సంక్షోభం పేరు చెప్పి ఓ పక్క కార్మికులు, ఉద్యోగుల వేతనాల్లో విపరీతమైన కోతలు విధిస్తుంటే మరో పక్క కంపెనీనీలు మాత్రం ఎప్పటిలాగా లాభాలు పోగేసుకుంటూనే ఉన్నాయి. బ్రిటన్ లోని టాప్ వెయ్యి మంది ధనికులు రికార్డు స్ధాయిలో 414 బిలియన్ పౌండ్లు కూడ బెట్టారని ‘ది డెయిలీ మోర్నింగ్ స్టార్’ పత్రిక నివేదించింది. ధనికుల సంపాదన పెరగడంతో పాటు, ధనికుల సంఖ్య కూడా పెరిగిందని పత్రిక…

పొదుపు విధానాలతో బాగా పడిపోయిన బ్రిటన్ల ఆదాయాలు

బడా బహుళజాతి కంపెనీలను సంక్షోభం నుండి బైటపడేయానికి ఇచ్చిన బెయిలౌట్ల కోసం అప్పులు తెచ్చిన పశ్చిమ దేశాల ప్రభుత్వాలు సదరు అప్పులు తీర్చడానికి ప్రజలపైనే భారం మోపుతూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాల వల్ల బ్రిటన్ లో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయని ప్రభుత్వ సంస్ధ ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ (ఒ.ఎన్.ఎస్) చేసిన సర్వేలో తేలింది. అదే సమయంలో సీనియర్ మేనేజర్ల వేతనాలు మాత్రం అనేక రెట్లు…