రెండిందాల నష్టపోతున్న మిడిల్ క్లాస్!
పన్ను చెల్లింపుదారుల్లో కార్పొరేట్ కంపెనీల కంటే మిడిల్ క్లాస్ ఆదాయంతో రోజులు కనాకష్టంగా వెళ్లదీసే వర్గమే అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని గత ఆర్టికల్ లో, ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సర్వే సాక్షిగా, చూశాం. అత్యధిక పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ‘అడకత్తెరలో పోకచెక్క’ పరిస్ధితిని కాస్త చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా రెండు రకాల పన్నుల ద్వారా ప్రజల నుండి ఆదాయం సమకూరుతుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు: ఆదాయ పన్ను, కార్పొరేట్ల లాభాలపై పన్నులు. రెండవది,…
