‘మేక్’ ఇన్ ఇండియా -కార్టూన్
బులెట్ ప్రూఫ్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై నిలబడి మొదటిసారి దేశ ప్రజలకు స్వాంతంత్ర్య సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇండియా రావాలనీ పిలుపు ఇచ్చారు. ఇక్కడ సరుకులు ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆశ చూపారు. విదేశీ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తానని ఎర్రకోట బురుజులపై నిలబడి చాటింపు వేశారు. ఇప్పుడు ఏ సరుకు చూసినా ‘మేడ్ ఇన్ చైనా’ స్టిక్కర్ ను ప్రదర్శించేవే.…