ఆకస్: అమెరికా, ఈయూల మధ్య చిచ్చు -2
దూరం అవుతున్న యూఎస్, ఈయూ ఈ అంశాన్ని కాస్త వివరంగా చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధానంతరం సోషలిజం విస్తరించనున్నదన్న భయంతో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఉమ్మడిగా పని చేయడం ప్రారంభించాయి యుద్ధంలో జర్మనీ, జపాన్, ఇటలీల ఫాసిస్టు కూటమిని ఓడించడానికి ఏర్పడిన నాటో కూటమి యుద్ధం ముగిశాక సోషలిజం నిర్మూలన లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది. ప్రధాన భౌగోళిక-రాజకీయ పరిణామాలన్నింటిలో యూఎస్, ఈయూ లు నాటో వేదికగా పరస్పరం సంప్రదించుకుని పాల్గొన్నాయి. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా…

