అసభ్య ఫోటోలు పంపి, బొంకి, కన్నంలో వేలుతో దొరికి, రాజీనామా చేసిన అమెరికా కాంగ్రెస్‌మేన్
ఈ మధ్య కాలంలో పశ్చిమ దేశాల రాజకీయవేత్తలు, ఆర్ధికవేత్తలు, ఇంకా ఇతర వేత్తలు లైంగికపరంగా అసభ్య చేస్టలతో దొరికిపోయి రాజీనామాలు చేయవలసి రావడం ఎక్కువైంది. ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిగ్ స్ట్రాస్ కాన్ హోటల్ ఉద్యోగినిపై అత్యాచారం జరపబోయి దొరికిపోయాడు. ఇప్పుడాయన కోర్టుకు హాజరవుతూ చేతులకు బేడీలు వేయొద్దని బతిమాలుకుంటున్నాడు. అక్రమ సంబంధం బైటపడడంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన నెవాడా సెనేటర్ జాన్ ఎన్‌సైన్, సెనేటర్ గా రాజీనమా చేశాడు. రిపబ్లికన్ పార్టీకే చెందిన న్యూయార్క్ కాంగ్రెస్…