ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు

ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు…