అవినీతి వ్యతిరేక కార్టూనిస్టు ‘అసీమ్ త్రివేది’ అరెస్టు, దేశవ్యాపిత నిరసన
రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా కార్టూన్లు గీసినందుకు కాన్పూర్ కార్టూనిస్టు అసిమ్ త్రివేది ని మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత నెలలో అసిమ్ త్రివేదికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ చేసిన స్ధానిక కోర్టు సోమవారం ఆయనని వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పజెప్పింది. త్రివేది అరెస్టుపై దేశవ్యాపితంగా నిరసన తలెత్తింది. ప్రెస్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అరెస్టును తీవ్రంగా ఖండించాడు. రాజకీయ నాయకుల…
