రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త…

అసరం అత్యాచారం: ప్రాధమిక సాక్ష్యాలున్నాయ్ -పోలీసులు

తన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినిపై అసరం బాపు అత్యాచారానికి పాల్పడ్డాడనేందుకు ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. జోధ్ పూర్ డి.సి.పి అజయ్ లాంబ ప్రకారం 16 యేళ్ళ బాలిక ఫిర్యాదుపై పోలీసులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అసరంపై బాలిక చేసిన ఆరోపణలు నిజమేనని వారి ప్రాధమిక విచారణలో తేలిందని

అసరం దొంగాట, పోలీసుల తొండాట

తన ఆశ్రమం నడిపే పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అసరం బాపు పోలీసులకు దొరక్కుండా దొంగాట ఆడుతుంటే, ఆయన ఎక్కడ ఉన్నదీ తెలిసి కూడా పోలీసులు తొండాట ఆడుతున్నారని పత్రికలు ఆరోపిస్తున్నాయి. హిందూ మత ప్రబోధకుడు అసరం బాపుకు ఇచ్చిన ఆగస్టు 30 తేదీ గడువు ముగిసినా ఆయన అరెస్టు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత దేవుడికీ, సామాన్యుడికి చట్టం ఒకే విధంగా ఎందుకు పని చేయదని జర్నలిస్టులు, ఎడిటర్లు ప్రశ్నిస్తున్నారు. జోధ్…

అసరం బాపు అసలు రూపు ఇదీ!

అసరం బాపు గుర్తున్నాడా? గత డిసెంబర్ నెలలో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య నోరు పారేసుకున్న బాబా!. అత్యాచారంలో నిర్భయ తప్పు కూడా ఉన్నదనీ, తనపై లైంగిక దాడి చేసినవారిని ఆమె ‘అన్నా, తమ్ముడూ’ అని వేడుకుని ఉంటే వారాపనికి దిగి ఉండేవారు కాదనీ, ఆ విధంగా ఆమె గౌరవం (ఆయన ఉద్దేశ్యం శీలం అని) కాపాడబడి ఉండేదనీ కూసిన మహా ‘పురుషుడు’! అంతటితో ఆగాడా? “రెండు చేతులు కలవకుండా శబ్దం రాదు…