పోలీసుల చేతుల్లోకి వెళ్ళిన ఫేస్ బుక్ అసభ్య సంభాషణల కేసు
ఫేస్ బుక్ లో తెలుగు వ్యాఖ్యాతలు మహిళలకు వ్యతిరేకంగా, వారి గుణ గుణాలను కించపరుస్తూ సాగించిన సంభాషణ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసభ్య వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణించిన మహిళలు విషయాన్ని శనివారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అనురాగ్ శర్మ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కనీసం 10 మంది మహిళలు కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కమిషనర్ గారెని కలిసిన అనంతరం వనిత టి.వి లో సాయంత్రం…
