అసరం దొంగాట, పోలీసుల తొండాట
తన ఆశ్రమం నడిపే పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అసరం బాపు పోలీసులకు దొరక్కుండా దొంగాట ఆడుతుంటే, ఆయన ఎక్కడ ఉన్నదీ తెలిసి కూడా పోలీసులు తొండాట ఆడుతున్నారని పత్రికలు ఆరోపిస్తున్నాయి. హిందూ మత ప్రబోధకుడు అసరం బాపుకు ఇచ్చిన ఆగస్టు 30 తేదీ గడువు ముగిసినా ఆయన అరెస్టు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రకటిత దేవుడికీ, సామాన్యుడికి చట్టం ఒకే విధంగా ఎందుకు పని చేయదని జర్నలిస్టులు, ఎడిటర్లు ప్రశ్నిస్తున్నారు. జోధ్…
