లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం సీరియస్‌గా లేదు, మరోసారి నిరాహార దీక్ష చేస్తా! -అన్నా హజారే
కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి తన నాలుగు రోజుల నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం అసలు స్వరూపం మెల్ల మెల్లగా అర్ధం అవుతోంది. అవినీతి ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఒట్టి గాలి మూటలేనని తెలిసి వస్తోంది. ఎన్నికల మేనిఫేస్టో పేరిట లిఖిత హామిలు ఇచ్చి పచ్చిగా ఉల్లంఘించే భారత దేశ రాజకీయ పార్టీలు ఒక సత్యాగ్రహవాదికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఉఫ్… అని ఊదిపారేయడం చిటికేలో పని అని గతం కంటే ఇంకా…