అవినీతి ఫైళ్ళు తగలబెడుతున్న ఢిల్లీ అధికారులు!
అరవింద్ కేజ్రివాల్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ఆయనింకా అధికార పీఠంపై కూర్చోనేలేదు. అప్పుడే ఢిల్లీ బ్యూరోక్రాట్ అధికారులకు చెమటలు కారిపోతున్నట్లున్నాయి. అవినీతి జరిగిన దాఖలాలను రుజువు చేసే ఫైళ్లను వారు తగలబెడుతున్నారని ఇండియా టుడే/ఆజ్ తక్ పత్రికా సంస్ధలు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బైటపడింది. మరి కొందరు అధికారులు బదిలీ చేయించుకోడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి రోజుకు 700 లీటర్ల మంచి నీరు ఉచితంగా సరఫరా చేస్తామన్న కేజ్రీవాల్…


